Third Covid Wave : భారత్‌లో అక్టోబర్, నవంబర్ మధ్య నెలల్లో గరిష్ఠానికి థర్డ్ వేవ్! : ఐఐటీ సైంటిస్ట్
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్.. అక్టోబర్, నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని ఐఐటీ సైంటిస్టు వెల్లడించారు. కానీ, సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ చాలా తక్కువ తీవ్రత ఉండొచ్చు.

India's Third Covid Wave Could Peak Between Oct And Nov
Third Covid Wave : భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్ (Third Covid Wave).. అక్టోబర్, నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని ఐఐటి-కాన్పూర్ సైంటిస్టు మణింద్ర అగర్వాల్ వెల్లడించారు. కానీ, సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ చాలా తక్కువ తీవ్రత ఉండొచ్చునని ఆయన అంచనా వేశారు. మహమ్మారి గణిత నమూనా ఆధారంగా మణింద్ర సహా ముగ్గురు సభ్యుల నిపుణుల బృందం కరోనా ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలపై అంచనా వేశారు. మరో కొత్త వైరస్ విజృంభించకుంటే మాత్రం పరిస్థితులు మారే అవకాశం లేదని అన్నారు. ఏదేమైనా.. సెప్టెంబర్ నాటికి ప్రస్తుతమున్న మ్యుటేషన్ల కంటే మరింత తీవ్రమైన మ్యుటేట్‌గా మారి థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుదని అంచనా వేశారు. ఒకవేళ థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటే.. మే నెలలో రెండవ వేవ్ గరిష్ట స్థాయికి చేరిన సమయంలో నమోదైన 4 లక్షల కేసుల కంటే ఎక్కువ రోజువారీ కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు.
రెండవ వేవ్ కారణంగా వేలాది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది కరోనా బారినపడ్డారు. కొత్త మ్యుటేషన్ రాకుంటే.. సెప్టెంబర్ నాటికి కొత్త వేరియంట్ 50శాతం ఎక్కువ మ్యుటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్సిలాన్ = 1/33 ప్రకారం.. థర్డ్ వేవ్‌లో కొత్త వేరియంట్ విజృంభించవచ్చు.. దీనికారణంగా కొత్త కేసులు రోజుకు ఒక లక్ష వరకు పెరుగుతాయని అగర్వాల్ అంచనా వేశారు. గత నెలలో గణిత మోడల్ ఆధారంగా.. అక్టోబర్, నవంబర్ మధ్య థర్డ్ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని సూచించింది. SARS-CoV2 మరింత తీవ్రమైన మ్యుటేషన్ గా మారితే.. రోజువారీ కేసులు ప్రతిరోజూ 1.5 లక్షల నుంచి 2 లక్షల మధ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. థర్డ్ వేవ్ సమయంలో ఇన్‌ఫెక్షన్‌లకు కారణమైన డెల్టా వేరియంట్ కంటే ఎక్కువగా ఏ మ్యుటేషన్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ, రోజువారీ కేసుల పరిధి లక్ష నుంచి 1.5 లక్షలకు తగ్గిందని గతవారం డేటా సూచించింది.
Pan Coronavirus Vaccine : పాన్ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధికి ఇదే సరైన సమయం
లేటెస్టు డేటాతో పోలిస్తే.. రోజువారీ ఇన్‌ఫెక్షన్‌లు లక్ష పరిధిలో తగ్గుతాయని భావిస్తున్నారు. జూలై, ఆగస్టులో వ్యాక్సినేషన్ డేటాతో యాంటీ-బాడీలు ఎంతవరకు కారకాలుగా మారుతాయనదేది చెప్పలేమని అగర్వాల్ చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి R లేదా పునరుత్పత్తి విలువ 0.89గా ఉందని గుర్తించారు. Cowin డాష్‌బోర్డ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ నిరోధించే అతిపెద్ద ఆయుధంగా వ్యాక్సినేషన్ దేశంలో 63 కోట్లకు పైగా డోసులు అందాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 42,909 కొత్త COVID-19 కేసులు నమోదు అయ్యాయి. 380 కరోనా మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో మొత్తం కరోనా కేసులలో ఒక్క కేరళలోనే 29,836 కొత్త కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి.
<SUTRA’s analysis of third wave> @stellensatz @Ashutos61 @Sandeep_1966 @shekhar_mande It took us a while to do the analysis for three reasons. First, loss of immunity in recovered population. Second, vaccination induced immunity. Each of these two need to be estimated for future.
— Manindra Agrawal (@agrawalmanindra) July 2, 2021
టెస్టు పాజిటివిటీ రేటు చారిత్రాత్మక గరిష్టంగా 19.67 శాతంగా నమోదైంది. కొత్త కరోనా మరణాలతో సహా దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,38,210కి చేరింది. కొత్తగా 380 కరోనా మరణాలు నమోదు కాగా.. మొత్తంగా 75 మరణాలు కేరళ నుంచే ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర నుంచి 131 మరణాలు, ఒడిశా నుంచి 67 మరణాలు, మిగిలిన రాష్ట్రాల నుంచి 107 మరణాలు వరకు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,95,030కు చేరాయి. అందులో 3,76,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1.15 శాతం యాక్టివ్ కేసులే ఉన్నాయి. మొత్తం రికవరీలు 3,19,23,405కి చేరగా.. గత 24 గంటల్లో 34,763 రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 97.51 శాతంగా కరోనా రికవరీ రేటు నమోదైంది.
Covid Test Report : గుడ్ న్యూస్, కరోనా టెస్టు ఫలితం కొవిన్ యాప్‌లో