Breastfeeding : పాపాయి పుట్టిననాటి నుండి 3 నెలల వయసు వరకు ఉత్తమ ఆహారం తల్లిపాలే?

శిశువు జన్మించిన తరువాత మూడునెలల కాలంలో తల్లులు గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు, వేడిచేసి చల్లార్చిన నీటిని ఇస్తుంటారు. తల్లిపాలు సరిపడినంత ఉన్నప్పుడు వీటి అవసరం లేదు. తల్లిపాలు తాగటం వల్ల అలర్జీలు వస్తాయని కొందరు అపోహపడుతుంటారు. అలాంటి ఏమి ఉండదు. తల్లిపాలు సేవించే పిల్లలకు భవిష్యత్తులో ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి.

Breastfeeding : పాపాయి పుట్టిననాటి నుండి 3 నెలల వయసు వరకు ఉత్తమ ఆహారం తల్లిపాలే?

Breastfeeding | Feeding Your Baby | Start for Life

Updated On : December 27, 2022 / 1:44 PM IST

Breastfeeding : శిశువు జన్మించినది మొదలు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తల్లి ఆమెకు అందించే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పుట్టిన నాటి నుండి మూడు మాసాల వరకు శిశువుకు తల్లిపాలు తాగించటం శ్రేయస్కరం. తల్లిపాలను తాగించటం వల్ల వారి మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. అది పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతుంది.

పురిటి బిడ్డకు తల్లిపాలు తాగించటం వల్ల కల్తీల భయం ఉండదు. పిల్లల పెరుగుదలకు సంబంధించిన అన్ని పోషకాలు, తల్లిపాల ద్వారా లభిస్తాయి. తల్లిపాలు శిశువుకు ఇవ్వటం ద్వారా తల్లీ, బిడ్డ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇరువురికి ఆరోగ్యానికి ఇది మంచిది. తల్లిపాలల్లో ఉండే ఇమ్యునోగ్లోబ్యులిన్స్ అనే ప్రొటీన్లు పసిపిల్లల్లో వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

అధిక పోషక విలువలు కలిగిన ముర్రుపాలు శిశువులకు తప్పకుండా ఇవ్వటం వల్ల పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా ఉండారు. అంతేకాకుండా తల్లికి గర్భసంచి సాధారణ స్ధితికి చేరుంతుంది. పాలిచ్చే తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిపాలు శిశువుకు త్వరగా జీర్ణం అవుతాయి. విరేచనాలు అవుతాయన్న భయం ఉండదు.

శిశువు జన్మించిన తరువాత మూడునెలల కాలంలో తల్లులు గ్లూకోజ్ నీరు, పండ్ల రసాలు, వేడిచేసి చల్లార్చిన నీటిని ఇస్తుంటారు. తల్లిపాలు సరిపడినంత ఉన్నప్పుడు వీటి అవసరం లేదు. తల్లిపాలు తాగటం వల్ల అలర్జీలు వస్తాయని కొందరు అపోహపడుతుంటారు. అలాంటి ఏమి ఉండదు. తల్లిపాలు సేవించే పిల్లలకు భవిష్యత్తులో ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉంటాయి. పాలు సేవించలేని పిల్లలకు స్తన్యాన్ని పిండి గిన్నెలోకి పాలు తీసుకుని తాగించాలి.

అదేసమయంలో శిశువుకు పాలిచ్చే తల్లులు వారు రోజువారిగా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మొదటి మూడు నెలలపాటు మంచి ఆహారం తీసుకోవాలి. పోషక విలువలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవాలి. తల్లిపాలల్లో అన్ని పోషకాలు ఉంటాయి. అయితే ఇనుము లోపం ఉంటుంది. తల్లిపాలతో పాటే పాపాయికి ఇనుము అందే ఏర్పాటు చేయాలి. తల్లిపాలు చాలని పక్షంలో మాత్రమే ప్రత్యామ్నాయాలైన ఆవు, గేదె, డబ్బాపాల గురించి ఆలోచించాలి.