Green Papaya : పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో పోషకాలు అధికమా?
పచ్చి బొప్పాయిని దీన్ని ఉడకబెట్టుకుని తినవచ్చు. లేకుంటే వెజిటబుల్ సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. పచ్చి బొప్పాయిని గ్రీన్ టీతో ఉడకబెట్టడం ద్వారా తయారుచేసిన టీని తీసుకోవడం ఆర్థరైటిస్‌ను నయం చేస్తుంది.
Green Papaya
Green Papaya : బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సీ, డి లు తగిన మోతాదులో ఉన్నాయి. ఇందులో ఉండే ఎంజైములు జీర్ణ వ్యవస్ధను మెరుగుపరచటంలో సహాయకారిగా పనిచేస్తాయి. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయితోనే అధిక పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 100 గ్రాముల పచ్చి బొప్పాయిలో 39 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల శరీరంలోకి కొవ్వు చేరదు. రక్త ప్రసరణ సైతం సాఫీగా జరుగుతుంది. రక్తపోటు స్ధాయిని సమన్వయం చేయటంలో దోహదపడుతుంది.
బొప్పాయి ఆకులను చింతపండు, ఉప్పుతో కలపి తీసుకుంటే మహిళల్లో బహిష్టు కారక నొప్పులు తగ్గుముఖం పడతాయి. సౌందర్యంలోనూ బొప్పాయి సూపర్ గా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలతో పాటు పలు రకాల చర్మ వ్యాధులను నయం చేసే శక్తి పచ్చి బొప్పాయికి ఉంది. పచ్చి బొప్పాయితో అమీబియాసిస్, నులి పురుగుల బెడదను తగ్గించుకోవచ్చు. అజీర్ణం, పుల్లని తేన్పులు వంటి బాధలను తగ్గించేందకు దోహదపడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. కడుపులోని మలినాలను బయటకు పంపుతుంది. పండిన బొప్పాయి కంటే పచ్చిబొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి.
పచ్చి బొప్పాయిని దీన్ని ఉడకబెట్టుకుని తినవచ్చు. లేకుంటే వెజిటబుల్ సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. పచ్చి బొప్పాయిని గ్రీన్ టీతో ఉడకబెట్టడం ద్వారా తయారుచేసిన టీని తీసుకోవడం ఆర్థరైటిస్‌ను నయం చేస్తుంది. అధిక బరువును తగ్గించడంలో పచ్చి బొప్పాయి అద్భుతంగా
సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అదే సమయంలో శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగించి, మంచి కొలస్ట్రాల్ పెంచుతుంది. పచ్చి బొప్పాయి కంటి సంబంధిత వ్యాధులు, విటమిన్ల లోపం రాకుండా చూస్తుంది.
