Eye Damage : కంటి చూపు దెబ్బతినకుండా ఉండాలంటే ఈ అలవాట్లలో మార్పులు చేసుకోవటం మంచిది!
తినే ఆహారంలో విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తినే ఆహారంకూడా కంటి చూపు మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది రుచికరంగా ఉందని చెబుతారు.

It is better to make changes in these habits to avoid eye damage!
Eye Damage : కళ్ళు మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. రోజూవారీ అలవాట్లతో కంటి చూపు మందగిస్తుంది. అందుకే కళ్ళను జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. కళ్లు ఆరోగ్యంగా ఉంటే చూపు స్పష్టంగా ఉంటుంది. అయితే చాలామంది కళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. కంటి చూపు మందగించడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కొన్ని చెడు అలవాట్లు కూడా కంటి చూపుపై ప్రభావం చూపుతాయి. అయితే చాలా మంది కంటి సమస్యలు తలెత్తినప్పుడు, దృష్టి లోపాలు ఏర్పడినపుడు వెంటనే కళ్లజోడు, కాంటాక్ట్ లెన్సులతో తమకున్న సమస్యను పరిష్కరించుకుంటారు. ఫలితంగా అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించాల్సి వస్తుంది.
కంటి చూపుకోసం మార్చుకోవాల్సిన అలవాట్లు ;
మొబైల్ ఫోన్ స్క్రీన్‌లపై చిన్నగా ఉండే అక్షరాలను చదవొద్దు. స్క్రీన్‌లకు ఎక్కువగా అతుక్కుపోతే అది కళ్ళకు హాని కలిగిస్తుంది, కళ్లు పొడిబారతాయి, తలనొప్పి, కంటి ఒత్తిడికి లోనవుతాయి. నిద్ర తగ్గినప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలను తలెత్తుతాయి. వాటిలో ఒకటి కంటి చూపు మందగించడం. రోజుకు కనీసం 7 గంటల పాటు నిద్ర చాలా అవసరం. దీని వల్ల కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.
తినే ఆహారంలో విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తినే ఆహారంకూడా కంటి చూపు మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. చాలామంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది రుచికరంగా ఉందని చెబుతారు. అయితే ఇటువంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. క్యారెట్, నారింజ, డ్రై ఫ్రూట్స్, గుడ్లు, సీ ఫుడ్స్, బచ్చలికూర మొదలైనవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
ధూమపానంతో గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదంతో పాటు దృష్టి సమస్యలను కూడా కలిగిస్తుంది. ధూమపానం సిగరెట్లు, ఇతర రకాల పొగాకు ఉత్పతులు ఉపయోగించే అలవాటు ఉంటే వాటిని మానుకోవటం మంచిది. ఎండలో తిరిగే సమయంలో కళ్ళు హానికరమైన UV కిరణాలకు గురికావచ్చు. అది కంటి క్యాన్సర్ కు దారితీయవచ్చు. కాబట్టి ఎండలోకి వెళ్లే సమయంలో దుమ్ము పడకుండా , యూవీ కిరణాల నుండి రక్షణగా ఉండేందుకు సన్ గ్లాస్ అద్దాలను వాడుకోవటం మంచిది.
కళ్లను చీటికిమాటికి నలపడం, రుద్దడం చేయవద్దు. దీంతో మీ కళ్ల బయటి ఉపరితలం దెబ్బతింటుంది. కార్నియా బలహీనంగా మారుతుంది. దురదలు ఉన్న సందర్భంలో చల్లని నీటితో కళ్లను శుభ్రపరుచుకోవటం మంచిది. పని చేయడానికి కళ్ళలో తేమ ఉండాలి. మనం తక్కువ నీరు తాగితే ఈ కండరాల చురుకుదనం తగ్గుతుంది. దీని వల్ల కళ్లలో వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. కంట్లో నలక, దుమ్ము చేరినపుడు కంటి చుక్కలను ఉపయోగించవచ్చు. ఇది కంటిలోని మలినాలను తొలగించి, తేమను నిలుపుతుంది.