ఇలా ఆరోగ్యకరంగా 71 కిలోల బరువు తగ్గాను: స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ కంపెనీ సీఈవో వ్యాఖ్యలు

‘ఓ సారి నేను ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది. అప్పుడే నా ఆరోగ్యానికి నేనే బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు.

ఇలా ఆరోగ్యకరంగా 71 కిలోల బరువు తగ్గాను: స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ కంపెనీ సీఈవో వ్యాఖ్యలు

Weight Loss Journey

బరువు తగ్గడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలు, ఆహార నియమాలు ప్రారంభించి, అవి చేయలేక కొన్ని రోజులకే మానేస్తుంటారు. వారి సంకల్పాన్ని వారి బద్ధకం డామినేట్ చేస్తుంది. కొందరు మాత్రం పట్టుదలతో, నిబద్ధతతో ఏళ్ల తరబడి సాధనచేసి అనుకున్నది సాధిస్తారు.

వారి సంకల్పం ముందు బద్ధకం, ఇతర క్లిష్టతర పరిస్థితులు అన్నీ చిన్నబోతాయి. ఇటువంటి సక్సెస్ స్టోరీనే ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ హౌసింగ్.కామ్ సీఈవో ధ్రువ్ అగర్వాలాది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

ఏది అడిగితే అది చేసిపెట్టే పనివాళ్లు చుట్టూ ఉన్నా, ఏది కోరితే అది తినగల సౌకర్యాలు ఉన్నప్పటికీ బరువు తగ్గాలన్న సంకల్పంతో ఆయన పాటించిన నియమాలు అందరినీ ఆశ్చర్యపర్చుతూనే అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. రెండేళ్లలోనే ఆయన ఏకంగా 71 కిలోల బరువును తగ్గారు.

ఏమని చెప్పారు?
‘‘ఏదైనా ఒకరోజు బరువు తగ్గుతానని, ఫిట్‌గా మారతానని చాలాకాలంగా అనుకుంటూ ఉండేవాడిని. కానీ, అప్పట్లో అందుకు తగ్గ ప్రయత్నాలు సరిగ్గా చేయలేదు. ఓ సారి నేను ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది. అప్పుడే నా ఆరోగ్యానికి నేనే బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాను.

నా ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాల్సి భావించాను. అప్పటి నుంచి ఆ ప్రయత్నాలు చేసి 152 కిలోల బరువు ఉన్న నేను 80 కిలోలకు తగ్గాను. నా జీవన శైలిని పూర్తిగా మార్చేశాను. వ్యాయామం, ఆహార అలవాట్లనూ మార్చాను. ట్రైనర్ సూచనలతో మొదట నేను నదీ ప్రాంతంలో వాకింగ్ మొదలు పెట్టాను. ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ వాకింగ్ చేసేవాడిని.

నా ఫేవరెట్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ లా నేను ఫిట్ గా కావాలనుకున్నాను. ప్రతిరోజు 1,700 క్యాలరీల ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడిని. మద్యపానం మానేశాను. ప్రాసెసెడ్, ఫ్రై చేసిన ఆహారాలను ముట్టుకోలేదు. ప్రొటీన్ ఉన్న ఆహార పదార్థాలను తినేవాడిని.

నా లంచ్ లో 200-300 మిల్లీలీటర్ల పప్పు ఉంటుంది. 150-180 గ్రాముల మధ్య కూరగాలు ఉంటాయి. బేసన్ రోటీ తినేవాడిని. డిన్నర్ లో కాల్చిన చికెన్/ చేపల సెలెరీ/ఆస్పరాగస్ సూప్ తీసుకుంటున్నాను. మొలకెత్తిన గింజలు, క్యారెట్లు, దోసకాయలు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన వాటినే తీసుకుంటున్నాను. ఇప్పుడు చాలా ఆరోగ్యకరంగా తయారయ్యాను’’ అని ధ్రువ్ అగర్వాలా తెలిపారు.

Also Read : వాట్సాప్ భారతీయ యూజర్ల కోసం అంతర్జాతీయ పేమెంట్లు.. ఇదేలా పనిచేస్తుందంటే?