Low Blood Pressure : లో బీపీ సమస్య.. కారణాలు.. లక్షణాలు
లో బీపి సమస్యతో బాధపడుతున్నవారు ఆహారంలో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి.

Low Blood Pressure
Low Blood Pressure : మనిషికి ఎదురయ్యే ఆరోగ్యసమస్యల్లో అధిక రక్తపోటు, అల్ప రక్తపోటు అనేవి సాధారణమైనవి. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా కోరి ఆనారోగ్యసమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో తక్కువ రక్తపోటు కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు.
పెరుగుతున్న వయస్సు , సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. అధికశాతం మంది ఈ సమస్యను పెద్దగా పట్టించుకోరు. దీని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తరువాత ఇది పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. రక్తపోటు 90/60 కంటే తక్కువగా ఉంటే, మీరు తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారని గ్రహించాలి. ఆరోగ్యవంతులకు సాధారణ రక్తపోటు 120/180మధ్య ఉంటుంది.
లో బబీపీ లక్షణాలు ;
తక్కువ రక్తపోటు లక్షణాల విషయానికి వస్తే అస్పష్టమైన దృష్టి, గందరగోళం, నిరాశ, చలి, దాహం, శ్వాస నెమ్మదిగా తీసుకోవటం, మూర్చ, తేలికపాటి తలనొప్పి, గాయం తగిలిన సందర్భంలో ఎక్కువగా రక్తస్రావం జరగటం వంటివి గమనించవచ్చు. ఇతర జబ్బులకోసం తీసుకునే ఇతర ఔషదాలు సైతం ఇందుకు కారణం కావచ్చు.
లో బీపీ ఆరోగ్యంపై ప్రభావం ;
చాలా మంది తక్కువ రక్తపోటు సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి.
రక్తపోటును ఎలా నియంత్రించాలి ;
హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య, అయితే దానిని నుండి బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు. అధిక మొత్తంలో నీరు తాగటం ఎంతో మేలుకలుగుతుంది. నీరు లేకపోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ తగ్గి రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందువల్ల, రోజుకు కనీసం 7-8 గ్లాసుల నీరు త్రాగాలి. ఇలా చేయటంవల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడదు.
లో బీపి సమస్యతో బాధపడుతున్నవారు ఆహారంలో విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అధికంగా ఉండే వాటిని చేర్చుకోవాలి. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. తీసుకునే ఆహారం మొత్తం ఒకేసారి తినకుండా, తక్కువ మొత్తంలో విడతలవారీగా తింటూ ఉండాలి. ఒకే సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల మీ రక్తపోటు తగ్గుతుంది. ఎక్కువ ఉప్పు కలిగిన ఆహారాలు తీసుకోవాలి. ఉప్పులో ఉండే సోడియం రక్తపోటును పెంచడంలో సహాయపడుతుంది.
ఆల్కహాల్ తాగడం వల్ల తరచుగా శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆల్కహాల్‌ను పూర్తిగా నివారించేందుకు ప్రయత్నించండి. లేదంటే మితంగా త్రాగండి. రక్తంలో చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. థైరాయిడ్ చెకప్ కూడా ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. దీని కారణంగా తక్కువ రక్తపోటు సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని సార్లు, బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, తక్కువ రక్తపోటు సమస్య వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్లను నివారించడానికి ప్రయత్నించండి. వీటి బారిన పడినట్లయితే, వీలైనంత త్వరగా వైద్యుల సహాయం పొందటం మంచిది.