Makhana : జీర్ణవ్యవస్ధను మెరుగుపరిచి బరువు తగ్గించే మఖానా
ఆకలి పెంచడానికి, బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. షుగర్ వ్యాది గ్రస్తులు మఖానా తీసుకోవడం చాలా మంచిది.

Makhnas
Makhana : తామర గింజలనే మఖానా అనిపిలుస్తారు. ఈ మఖానా ఎంతో రుచిని కలిగి ఉంటాయి. మఖానాలో బోలెడన్ని పోషక విలువలు ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మఖానాలో సమృద్ధిగా ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని దరిచేరకుండా చూసుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన ఫూల్ మఖానా లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటి వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి. క్యాలరీలు, సోడియం దీనిలో తక్కువగా ఉంటాయి. పొటాషియం ఎక్కువగా ఉంటుంది.
నిద్రలేమి సమస్యతో సతమతమయ్యేవారు తీసుకుంటే ఈ సమస్యను నివారిస్తుంది. ఎనీమియా, పిత్త, కఫ వైద్యంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. రక్తహీనతకు గల రోగులకు ఇది ఔషధంలా పని చేస్తుంది. గర్భిణీలకు, బాలింతలకు అయితే బలవర్థకమైన ఆహారంగా చెప్తారు.
ఆకలి పెంచడానికి, బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. షుగర్ వ్యాది గ్రస్తులు మఖానా తీసుకోవడం చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగై, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శరీరం నుండి విషపదార్ధాలను బయటకు పంపడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎర్ర రక్తకణాలను రీసైకిల్ చేయడం ద్వారా రక్త వ్యవస్థను సమర్థవంతంగా ఉంచడంలో దోహాధం చేస్తాయి.
మఖానాతో చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయి. చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. కీళ్ల సమస్యలు, దంత సమస్యలతో బాధపడేవారు ఈ గింజలను ఎక్కువగా తీసుకోవటం వల్ల వీటిలోని క్యాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా తయారుచేసేందుకు ఉపకరిస్తాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అంటే అవి రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది.