Children’s Fitness : పిల్లల ఫిటెనెస్ కు మార్షల్ ఆర్ట్స్

ఇలాంటి వాటిలో చిన్నారులు శిక్షణ పొందటం వల్ల వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి.

Children’s Fitness : పిల్లల ఫిటెనెస్ కు మార్షల్ ఆర్ట్స్

Martial Arts

Updated On : February 6, 2022 / 4:54 PM IST

Children’s Fitness : పిల్లల ఫిట్ నెస్ కు మార్షల్ ఆర్ట్స్ ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. కరాటే, జుడో, టైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్త్ తోపాటు ఇటీవలి కాలంలో పట్టణాలు, నగరాల్లో జిమ్స్ లో కొత్త తరహా మార్షల్ ఆర్ట్స్ లో చిన్నారులకు తర్ఫీదునిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల చిన్నారులకు వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా చిన్న వయస్సులో ఉన్న వారికి ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరం, మెదడు, చురుకుగా ఉంచటంలో దోహదం చేస్తాయి.

అంతే కాకుండా ఆత్మరక్షణకు ఎంతగానో సహకరిస్తాయి. శరీరాన్ని ఫిట్ గా ఉంచుతాయి. ఎలాంటి అత్యవసర పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఉపకరించటంతోపాటు ఒత్తిడిని అదిగమించేలా చేస్తాయి. అంతే కాకుండా శరీరాన్ని, ఎముకలను ధృఢంగా మారుస్తాయి.ఇలాంటి వాటిలో చిన్నారులు శిక్షణ పొందటం వల్ల వారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అంతేకాకుండా శిక్షణ సమయంలో సహ విద్యార్ధులతో కలసి తమ ప్రతిభను అందరి ముందు ప్రదర్శించటం వల్ల వారిలో భయం, బెరకు తొలగిపోతాయి. మార్షల్ ఆర్ట్స్ లో రాణించే విద్యార్ధలకు లభించే అవార్డులు, రివార్డుల వల్ల వారిలో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఉపకరిస్తాయి. దీని వల్ల వారు తమ లక్ష్య సాధనలో ప్రేరణకు ఎంతగానో ఉపకరిస్తాయి.

మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందే చిన్నారులు క్రమశిక్షణతో మెలగటంతోపాటు ఇతరలతో ఎలా మెలగాలి అన్న విషయంలో అవగాహాన కలుగుతుంది. ఆరోగ్యంగా ఉండటంతోపాటు చదువులోనూ రాణించగలుగుతారు. ముఖ్యంగా ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల ఆకతాయిలను ఎదుర్కోనేందుకు అవసరమైన సామర్ధ్యాన్ని వారికి కలుగుతుంది.