December Flowers : ఔషధగుణాలు కలిగిన డిసెంబర్ పూలు
ఈ మొక‌్క ఆకులను దగ్గు, న్యుమోనియా చికిత్సకు ఉపయోగిస్తారు. వేర్లు, ఆకులు జలుబు, ప్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి.

December Flowers
December Flowers : గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లముందు, రోడ్లపక్కన ఎక్కువగా కనిపించే మొక్క డిసెంబర్ పూల చెట్టు. వీటిని గొబ్బిపూలు, పెద్ద గోరింట అని కూడా అంటారు. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అలంకరించుకోవడానికీ, దేవుడి పూజకు సమర్పించటానికి వినియోగిస్తారు. సీజనల్ వారీగా వచ్చే పూలు ఎన్నో ఉన్నా డిసెంబర్ పూలది ఓ ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఈ పూలు శీతాకాలంలో వలసవచ్చే చిన్నచిన్న పక్షులకు మకరందాన్ని అందిస్తాయి. ఊదారంగు, బంగారు వర్ణం, అరుదుగా తెలుపు, లేత గులాబీ వర్షాలలో కనిపిస్తాయి. నవంబర్ నెల చివరి నుంచే చిగురులు తొడిగి డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు విరబూస్తాయి.
ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ మొక‌్క ఆకులను దగ్గు, న్యుమోనియా చికిత్సకు ఉపయోగిస్తారు. వేర్లు, ఆకులు జలుబు, ప్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. హెపాటిక్ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. విత్తనాలు పాము కాటు విరుగుడుగా ఉపయోగిస్తారు.
ఈ మొక్కను రక్తహీనతతో బాధపడేవారికి ఔషధంగా కూడా ఆయుర్వేదంలో సూచిస్తారు. డిసెంబర్ పూలమొక్కను రక్త శుద్ధి కోసం, మధుమేహం చికిత్సలో ఉపయోగిస్తారు. వేర్ల రసం అజీర్తికి ఉపశమనంగా పనిచేస్తుంది. డిసెంబర్ మొక్క ఆకు రసాన్ని కాలిన గాయాల వాపు తగ్గటానికి ఉపయోగిస్తారు. మూత్రసంబంధిత వ్యాధులు, రక్త శుద్ధీకరణ వంటి వాటిలో ఔషథంగా వాడుతారు.