Millets : పోషకాల లోపాన్ని నివారించే చిరుధాన్యాలు!

మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు సామ‌ల‌ను తింటే ఎముక‌లు, న‌రాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్స‌ర్ రాదు. బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఉలవ‌ల‌ను తినాలి. వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Millets : పోషకాల లోపాన్ని నివారించే చిరుధాన్యాలు!

Millets

Updated On : April 18, 2022 / 3:04 PM IST

Millets : మన రోజువారి ఆహారంలో చిరుధాన్యాలను తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనలు చేకూరతాయి. ఇదే విషయం అనేక పరిశోధనల్లో కూడా నిరూపితమైంది. ముఖ్యంగా చిరుధాన్యాల్లో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ , కాల్సియం వంటి సూక్మ్ష పోషకాలు అందుతాయి. చిరుధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో అమ్లాలు, పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావాల్సిన రోజువారి పోషకాలన్నీ లభిస్తాయి.

ముఖ్యంగా ఎదిగే వయస్సున్న పిల్లలకు చిరుధాన్యాలను ఇవ్వటం వల్ల వారిలో పోషకాహార లోపం తొలగిపోయి శారీరక ఎదుగుదల వేగంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇటీవలికాలంలో పిల్లల్లో పోషకాహార లోపంతో చిన్నారులు బాధపడుతున్నారన్న విషయం గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఈ నేపధ్యంలో చిన్నారులకు బియ్యం తో వండిన అన్నాన్ని తగ్గించి కొంత మేర చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను అందించటం వల్ల వారిలో పోషకాహార లోపాన్ని నివారించటానికి అవకాశం ఉంటుంది.

కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు అన్నిప్రాంతాల్లో అందరికి అందుబాటులోనే ఉండేవే. చాలా మందికి వీటిపై సరైన అవగాహన లేకపోవటం వల్ల వీటిని తినేందుకు పెద్దగా ఆసక్తి చూపించటంలేదు. పూర్వం బియ్యం అన్నం లేక ముందు మన పూర్వికులంతా చిరుధాన్యాలతో తయారైన ఆహారాన్నే రోజువారిగా తీసుకునే వారు. శరీరానికి పుష్టికరమైన ఆహారం కావటంతో అప్పటి వారిలో పోషకాలు మెండుగా ఉండటం వల్ల ఎలాంటి శారీరక పరమైన రుగ్మతలు లేకుండా ఎక్కువ సంవత్సరాలు జీవించ గలిగారు.

చిరు ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువును తగ్గించడంతోపాటు రక్తంలో షుగర్ స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గడానికి అల్సర్ల వంటివి తలెత్తకుండా దోహదపడతాయి. మలబద్దకం కూడా దూరం అవుతుంది. చిరు ధాన్యాల్లో పిండి పదార్థంతో పాటు ప్రోటీన్లు, పీచు పదార్థం, ఇనుము, క్యాల్షియం వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి.

గుండె జబ్బులు, డయాబెటిస్, ఊబకాయం, నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, రక్తస్రావం వంటి సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకుంటే కొంతమేర సమస్య నుండి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుంది. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అరికెల‌ను తింటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే క్యాన్స‌ర్ దరిచేరదు. మ‌ల‌బ‌ద్ద‌కం, జీర్ణ స‌మ‌స్య‌లు, డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఊద‌ల‌ను తింటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అధిక బ‌రువు, డ‌యాబెటిస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు స‌జ్జ‌ల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది. వీటి వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. శ‌రీరానికి రాగులు చ‌ల‌వ చేస్తాయి. ఎండ‌కాలంలో వీటిని తీసుకుంటే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం క‌లుగుతుంది. అలాగే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది.

మైగ్రేన్ స‌మ‌స్య ఉన్న‌వారు సామ‌ల‌ను తింటే ఎముక‌లు, న‌రాలు దృఢంగా మారుతాయి. పేగు క్యాన్స‌ర్ రాదు. బాలింత‌ల్లో పాలు ఎక్కువ‌గా త‌యార‌య్యేలా చేస్తాయి. కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారు ఉలవ‌ల‌ను తినాలి. వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. మూత్ర సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. అధిక బ‌రువుతో ఇబ్బందులు ప‌డేవారు కొర్ర‌ల‌ను వండుకుని తినాలి. దీని వ‌ల్ల బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. గుండె జ‌బ్బులు రావు. కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.