Moderna-Delta Variant : మోడెర్నా కొవిడ్ టీకాతో యాంటీబాడీలు.. డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలవు!

ప్రపంచాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఈ వేరియంట్ అమెరికా సహా ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ డెల్టాపై మోడెర్నా కొవిడ్ టీకా రక్షణాత్మక యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని ఒక అధ్యయనంలో తేలింది.

Moderna-Delta Variant : మోడెర్నా కొవిడ్ టీకాతో యాంటీబాడీలు.. డెల్టా వేరియంట్‌ను అడ్డుకోగలవు!

Moderna’s Covid Shot Produces Antibodies Against Delta Variant (1)

Updated On : June 30, 2021 / 7:03 AM IST

Moderna-Delta Variant : ప్రపంచాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ఈ వేరియంట్ అమెరికా సహా ప్రపంచ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ డెల్టాపై మోడెర్నా కొవిడ్ టీకా రక్షణాత్మక యాంటీబాడీలను ఉత్పత్తి చేసిందని ఒక అధ్యయనంలో తేలింది. డెల్టాతో సహా వివిధ కరోనా వేరియంట్ల స్పైక్ ప్రోటీన్లపై కొవిడ్ టీకా యాంటీబాడీలు కలిగిన 8 మంది బ్లడ్ శాంపిల్స్ పరీక్షించారు. ఈ టీకాను పరీక్షించిన అన్ని వేరియంట్‌లకు వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ టైటర్లను ఉత్పత్తి చేసిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రీ-ప్రింట్ సర్వర్ బయోఆర్క్సివ్‌లో ఫలితాలు విడుదలయ్యాయి. రక్షిత ప్రోటీన్లను న్యూట్రలైజింగ్ యాంటీబాడీలుగా పిలుస్తారు. ఎందుకంటే ఇవి వైరస్ కణాలలోకి రాకుండా నిరోధించగలవు. వైరస్ ఇతర వేరియంట్లపై యాంటీబాడీల పరిమాణంతో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌పై యాంటీబాడీల స్థాయిలను తటస్తం చేయడంలో 2.1 రెట్లు తగ్గిందని తేలింది. ఫలితాల అనంతరం న్యూయార్క్‌లో మోడెర్నా షేర్లు ఒక్కసారిగా 5.9శాతం మేర లాభపడ్డాయి.

నైజీరియాలో మొదట కనుగొన్న ఇటా స్ట్రెయిన్ యాంటీబాడీ స్థాయిలు 4.2 రెట్లు తగ్గాయి. అంగోలాలో A.VOI.V2 అని పిలిచే కొత్త వేరియంట్‌కు వ్యతిరేకంగా ఎనిమిది రెట్లు తగ్గింది. మెసెంజర్ RNA టీకా బలమైన రోగనిరోధక యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. మోడెర్నా కొవిడ్-19 వ్యాక్సిన్ కొత్తగా గుర్తించిన వేరియంట్ల నుంచి ఈ కొత్త డేటాను విడుదల చేశామని మోడెర్నా సీఈఓ స్టీఫేన్ బాన్సెల్ తెలిపారు.