Mulberry Fruit : మల్బరీ పండు.. ఔషధగుణాలు మెండు!
మల్బరీ పళ్లలో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి, ఇవి ఎముక కణజాలు బలంగా ఏర్పడడానికి సహాయపడతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Mulberry Fruit
Mulberry Fruit : మల్బరీ చెట్టు కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. పులుపు, తీపి సమ్మెళనంతో ఉండే ఈ కాయలను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. మల్చరీ కాయల్లో అనేక పోషకాలతోపాటు ఔషధగుణాలు కూడా ఉన్నాయి. మల్బరీ కాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లూ, ఫ్లెవనాయిడ్లూ, ఆల్కలాయిడ్లూ , ఫినాలిక్ ఆమ్లాలూ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, కె లు ఉన్నాయి. అంతేకాకుండా మల్బరీ కాయలను తినటం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
మల్బరీ ఆరోగ్య ప్రయోజనాలు ;
రక్తపోటుకు: మల్చరీలలో రెస్వెరట్రాల్ అనే యాంటీయాక్సిడెంట్ అధికంగా ఉండడం వల్ల అవి రక్తపోటును తగ్గించడంలో సహాయం చేస్తాయి. దీంతో పాటు రెస్వెరట్రాల్ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అది ఒక వేసోడైలేటర్ గా పని చేసిన రక్త నాళాలను సడలించేలా చేస్తుంది. మల్బరీలో అధిక స్ధాయిలో ఉండే ఐరన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది.
గుండెకు: పరిశోధనలు మల్బరీ పళ్లకు హైపోలిపిడెమిక్ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపాయి. వాటిలో ఉండే ఆహార పైబర్ మరియు లినోలెయిక్ ఆసిడ్లు హైపోలిపిడెమిక్ చర్యకు బాధ్యత వహిస్తాయి అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మధుమేహానికి: మల్బరీ పళ్ళు రక్త గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాక మల్బరీ పళ్ళ వినియోగం ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉండే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యుటెస్, కేటలెస్ వంటివి ప్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేసి మధుమేహాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. డయాబెటిస్ ప్రేరిపితం కారణంగా బరువు పెరగటాన్ని తగ్గించటానికి మల్బరీ ఆకుల, పండ్ల సారం ఉపయోగపడుతుంది.
కళ్ళకు: మల్బరీ పళ్ళ వినియోగం కంటి ఆరోగ్యానికి మంచిది, వీటిలో జీయజాన్టిన్ అనే కెరాటినోయిడ్ ఉంటుంది. ఇది రెటీనా నష్టాన్ని, కంటిశుక్లాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తికి: మల్బరీ పళ్లలో ఉండే ఆల్కలాయిడ్ల ద్వారా మాక్టోఫేజ్ కణాలను ప్రేరేపించి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే మల్చరీలలో విటమిన్ సి కూడా ఉంటుంది ఈ విటమిన్ శరీరంలోని బయటి వ్యాధికారక సుక్మజీవులపై పోరాడుతుంది.
కాలేయం కోసం: మల్బరీ పళ్లలో కాల్షియం మరియు ఐరన్ అధికంగా ఉంటాయి, ఇవి ఎముక కణజాలు బలంగా ఏర్పడడానికి సహాయపడతాయి. అలాగే ఆస్టియోపోరోసిస్ మరియు ఆర్థరైటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాలేయానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఫ్యాటీ లివర్ సమస్యను నివారించటంలో ఉపకరిస్తాయి. కాలేయ పనితీరు మెరుగుపర్చటంతోపాటు, కాలేయనికి రక్షణగా దోహదపడతాయి.
క్యాన్సర్ నివారణలో: మల్చరీలో ఉండే అంతోసియానిన్లు వివిధ క్యాన్సర్ల నివారణకు సహాయం చేస్తాయి. మల్బరీ చెట్టు వేర్ల సారం మానవ కోలొరెక్టల్ క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గిచి, క్యాన్సర్ కణాల మరణనాన్ని పెంచాయని తేలింది.
మెదడుకు ; మల్బరీ పళ్ళు న్యూరోప్రొటెక్టీవ్ చర్యలను కలిగి ఉంటాయి అందువల్ల మెదడు సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ విట్రోకు గురైన మెదడు కణాలపై సైటోప్రొటెక్టివ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ ఏ మరియు ఇ మరియు ల్యూటిన్, బీటా-కెరోటిన్ వంటి కెరోటినాయిడ్‌లు చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.