థాకరే.. క్యాట్ స్నేక్ : అచ్చం పిల్లి చర్మంలానే ఉంది చూడండి

  • Published By: sreehari ,Published On : September 28, 2019 / 07:49 AM IST
థాకరే.. క్యాట్ స్నేక్ : అచ్చం పిల్లి చర్మంలానే ఉంది చూడండి

Updated On : September 28, 2019 / 7:49 AM IST

కొత్త జాతికి చెందిన పాములను వెస్టరన్ ఘాట్ దగ్గర గుర్తించారు. చూడటానికి అచ్చం పిల్లి చర్మం మాదిరిగానే ఉండటంతో వీటిని క్యాట్ స్నేక్ లు గా పిలుస్తున్నారు. సుమారుగా 125 ఏళ్ల తర్వాత ఈ రకమైన క్యాట్ స్నేక్ జాతి పాములను గుర్తించినట్టు వైల్డ్ లైఫ్ రీసెర్చర్ తెలిపారు. శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే కుమారుడు తేజస్ థాకరే సహకారంతో గుర్తించిన ఈ వింతైన పాము నిజమైన శాస్త్రీయ నామం.. బోయిగా థాక్రేయ్.. అందుకే.. థాకరే ఇంటి పేరుకు శాస్త్రీయ నామం పోలి ఉండటంతో ఆ పాముకు థాకరే క్యాట్ స్నేక్ అని నామకరణం చేశారు. కోయ్నా వైల్డ్ లైఫ్ శాంచురీ రీజియన్ లో పరిశోధకుల బృందానికి కనిపించింది. ఈ బృందంలో తేజస్ కూడా ఉన్నారు. బాంబే నేచురల్ హిస్టరీ సోసైటీ (BNHS) జనరల్ లో పబ్లిష్ అయిన రీసెర్చ్ పేపర్ లో ఈ క్యాట్ స్నేక్ జాతికి సంబంధించి వివరాలను వర్ణించారు. 

1894 తర్వాత చివరిసారిగా 2015లో క్యాట్ స్నేక్ జాతి పామును తేజస్ గుర్తించారు. వీటిపై లోతుగా అధ్యయనం చేయగా.. ప్రత్యేకమైన జాతికి చెందిన క్యాట్ స్నేక్ పాములని, ఇలాంటి జాతిని ఎన్నడూ గుర్తిచలేదని పుణె ఆధారిత ఫౌండేషన్ బయోడైవర్సిటీ కాన్ సర్వేషన్ కు చెందిన పరిశోధకులు వారద్ గిరి వెల్లడించారు. క్యాట్ స్నేక్ పాము విలక్షణమైన జాతికి చెందినదని, మూడు అడుగుల పొడవు వరకు పెరుగుతాయని అన్నారు. ఈ పాములు విషపూరితమైనవి కావని అన్నారు. 

ఇదే ప్రాంతంలో గతంలో గుర్తించిన క్యాట్ స్నేక్ ల DNA కంటే విభిన్నంగా ఉన్నట్టు తమ పరిశోధనలో గుర్తించినట్టు గిరి చెప్పారు. బోయిగా థాక్రేయ్ శాస్త్రీయ నామంతో పిలిచే క్యాట్ స్నేక్.. చెట్ల తొర్రల్లో నివసించే ఒకరకమైన కప్పల గుడ్లను పొదుగుతాయి. క్యాట్ స్నేక్ శరీర నిర్మాణం ఇండియాలో కనిపించే ఇతర పాముల మాదిరిగా ఉండదు. క్యాట్ స్నేక్ చర్మం రంగు కూడా చాలా వింతగా పిల్లి చారలు మాదిరిగా కనిపిస్తుందని గిరి సహా పరిశోధకుల బృందం తమ అధ్యయనంలో గుర్తించింది.