Omicron Variant: కళ్లలో ఈ తేడా గమనించారా లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్ కావొచ్చు

కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైంది. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలతో పాటు దీని లక్షణాలు కళ్లలోనూ కనిపిస్తున్నాయి.

Omicron Variant: కళ్లలో ఈ తేడా గమనించారా లైట్ తీసుకోవద్దు.. ఒమిక్రాన్ కావొచ్చు

Omicron Variant

Updated On : January 23, 2022 / 7:12 AM IST

Omicron Variant: కరోనావైరస్ వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైంది. జలుబు, దగ్గు, జ్వరం, విరేచనాలతో పాటు దీని లక్షణాలు కళ్లలోనూ కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొత్త వేరియంట్ తొలి లక్షణం.. కళ్లలో గమనించొచ్చని అంటున్నారు నిపుణులు. కాకపోతే ఇలాంటి లక్షణం ఇతర వేరియంట్ల ద్వారా కూడా వస్తుందని చెబుతున్నారు.

కళ్లు అసాధారణంగా లేదా అస్పష్టంగా కనిపించడం లక్షణాలు ఉంటాయి. కంటి తీరును బట్టి ఇంకా ఎక్కువ లక్షణాలు కూడా గమనించగలం. ఒమిక్రాన్ వేరియంట్ తో బాధపడే చాలా మంది కళ్లు పింక్ కలర్ లోకి మారాయట. అంతేకాకుండా కంటి రెప్ప, కంటి కింద రెప్ప ఉబ్బినట్లుగా ఉండటం, కళ్లలో మంట కనిపించాయని బాధితులు చెప్తున్నారు.

కళ్లు ఎర్రగా మారడంతో పాటు మంట, నొప్పి అనేది కొత్త ఇన్ఫెక్షన్ లో భాగం. మసకగా కనిపించడం, కళ్లలో నీరు గారడం, ఒమిక్రాన్ తో బాధపడే పేషెంట్లలో కనిపించే లక్షణం. ఈ లక్షణాలు కనిపిస్తే.. ఒమిక్రాన్ సోకిందని కన్ఫామ్ చేసుకోలేం. ఇతర కొవిడ్ సమస్యలు కూడా ఉన్నాయా అనేది కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వైద్య పరీక్షలకు వెళ్లండి.

సాధారణంగా ఈ సమస్య చాలా మందిలో కనిపించేదే. అలాంటప్పుడు దూదిని కానీ, కాటన్ గుడ్డను తడిపి కంటిని తుడుస్తూ ఉండండి. దీని ద్వారా చాలా రిలీఫ్ వస్తుంది.