Screen Time Effect : ఓ మై గాడ్.. టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇంత డేంజరా? పిల్లల్లో పెరిగిపోతున్న ఆ సమస్య.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్..

పోస్ట్ కోవిడ్ తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది నిరంతరం కొనసాగి స్క్రీన్ టైమ్ పెరిగి..

Screen Time Effect : ఓ మై గాడ్.. టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇంత డేంజరా? పిల్లల్లో పెరిగిపోతున్న ఆ సమస్య.. పేరెంట్స్ బీ కేర్ ఫుల్..

Updated On : February 24, 2025 / 1:42 AM IST

Screen Time Effect : డేంజర్ స్క్రీన్ తో పిల్లల్లో కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇటీవల రెండు దఫాలుగా గవర్నమెంట్ స్కూల్స్ లో నిర్వహించిన కంటి పరీక్షల్లో సుమారు 90వేల మంది పిల్లలు ఐ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా తేలింది. నిత్యం ఫోన్ కి అతుక్కుపోయే పిల్లల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు గుర్తించారు.

చాలామంది విద్యార్థులు బోర్డుపై అక్షరాలు కనిపించక నోట్ చేసుకోలేకపోతున్నారని, పుస్తకాన్ని కళ్లకు దగ్గరగా పెట్టుకుని చదువుతున్నారని గుర్తించారు. పిల్లల్లోని దృష్టి లోపం వారి చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చారు. పిల్లల్లో కంటి సమస్యలు పెరగడానికి స్మార్ట్ ఫోన్లు, టీవీలే కారణం అని డాక్టర్లు చెబుతున్నారు.

పోస్ట్ కోవిడ్ తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది నిరంతరం కొనసాగి స్క్రీన్ టైమ్ పెరిగి కంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. కోవిడ్ తర్వాత చాలా స్కూళ్లు వాట్సాప్ ద్వారా హోమ్ వర్క్స్ ఇవ్వడం, వాటి కోసం ఆన్ లైన్ లో సమాచారం సేకరించాల్సి రావడం, పేరెంట్స్ కూడా ఆన్ లైన్ లెర్నింగ్ యాప్స్ లో కోచింగ్ ఇప్పిస్తుండటంతో ఎక్కువమంది విద్యార్థులు ఇంట్లో ఉన్న సమయంలో స్క్రీన్ ముందే అధికంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు కొందరు పిల్లలు ఆన్ లైన్ స్టడీస్ పేరుతో సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ, బ్రౌజింగ్ చేస్తూ గడిపేస్తున్నారు. మొబైల్, డెస్క్ టాప్ ను పరిమితంగా వాడకపోవడం, కంటి నుంచి తగినంత దూరం పాటించకపోవడం వల్లే సమస్య పెద్దదవుతోందని ఆప్తమాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

 

సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 30 నుంచి 40 సార్లు కంటి రెప్పలను కట్టాలి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపే వారు కంటిని నిమిషానికి 20 సార్లు కూడా కొట్టడం లేదని ఓ సర్వేలో వెల్లడైంది. దీంతో కళ్లు తడారిపోయిన డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడుతున్నారని, బ్లింకింగ్ తక్కువ ఉండటంతో కళ్లు త్వరగా తడారిపోయి తలనొప్పి, ఇరిటేషన్ కు గురవుతున్నారు.

ఎండిన కళ్లను రబ్ చేయడం వల్ల కనుపాపలు దెబ్బతిని చూపు మసక బారుతోందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ఇటీవలి కాలంలో పిల్లల్లో దూర దృష్టి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కంటి సైట్ ఏడాదికి ఒకసారే మారుతుంది. అయితే స్క్రీన్ టైమ్ పెరగడంతో 6 నెలలకు ఒకసారి సైట్ నెంబర్ పెరుగుతుందని వైద్యులు తెలిపారు.

Also Read : ఇప్పుడు నీ జోస్యం ఏమైంది? పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందన్న ఐఐటీ బాబాను ఏకిపారేసిన నెటిజన్లు..

స్క్రీన్ పై వచ్చే బ్లూ లైట్ ఎక్స్ పోజర్ వల్ల వృద్దాప్యంలో రావాల్సిన మాక్యులర్ డి జనరేషన్ చిన్నతనంలోనే వస్తుందని, అందువల్ల బ్లూ లైట్ కాంట్రాస్ట్ తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక స్క్రీన్ ఎక్కువగా చూసే వారు 20 20 20 రూల్ ఫాలో కావాలని వైద్యులు చెబుతున్నారు. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి స్క్రీన్ ను పక్కన పెట్టి 20 ఫీట్ల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకన్ల పాటు చూడాలని వైద్యులు సూచిస్తున్నారు.

దీని వల్ల కంటి వెసల్స్ రిలాక్స్ అవుతాయి. సమస్య ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా ప్రతి ఏటా కంటి పరీక్షలు చేయించుకోవాలి. చిన్న చిన్న చిట్కాలను ఫాలో అయితే పిల్లల్లో కంటి సమస్యలు దూరమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.