Probiotics : ఒత్తిడిని దూరం చేసే ప్రోబయాటిక్స్!

జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి జీర్ణవ్యవస్ధలో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో తోడ్పతతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో, మెదడు జీర్ణవ్యవస్థ పనితీరును మారుస్తుంది.

Probiotics : ఒత్తిడిని దూరం చేసే ప్రోబయాటిక్స్!

Stress

Updated On : July 14, 2022 / 4:58 PM IST

Probiotics : మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మన నిద్ర విధానాన్ని భంగపరుస్తుంది. బరువు పెరగడానికి,శరీరంలోని హార్మోన్లలో అసమతుల్యతకు కారణమవుతుంది. పెరిగిన ఒత్తిడి మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటైన పేగు ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

జీర్ణప్రక్రియలకు, జీర్ణమైన ఆహారంలోని పోషకాలు దేహానికి జీర్ణవ్యవస్ధలో ఉండే మంచి బ్యాక్టీరియా ఎంతో తోడ్పతతాయి. ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో, మెదడు జీర్ణవ్యవస్థ పనితీరును మారుస్తుంది. ఒత్తిడి రోజురోజుకు కొనసాగితే, అది మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అప్పుడు శరీరం, ఆహారాన్ని జీర్ణం చేయడంపై తక్కువ శ్రద్ధ చూపుతుంది. ఆసమయంలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఇది బలహీనమైన రోగనిరోధక శక్తికి దారితీస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి జీర్ణంకాని ఆహారం మరియు టాక్సిన్స్ ఎక్కువ కాలం ప్రేగులలో మిగిలిపోతుంది.

జీర్ణవ్యవస్థ దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే పెరుగు, మజ్జిగ, కొద్దిగా పులిసేందుకు అవకాశం ఉన్న పిండితో చేసే ఇడ్లీ, దోస వంటి ఆహారాలు తీసుకుంటే మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తీసుకోవటం వల్ల ప్రో బ్యాక్టీరియా అందుతుంది. ఇది ఒత్తిడి తగ్గడానికి ఎంతగానో తోడ్పడుతుంది. జీర్ణ వ్యవస్ధ పనితీరు మెరుగవుతుంది. క్రమం తప్పకుండా ప్రోబయాటిక్స్ ఆహారం తీసుకోవటం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.