Pomegranate : మెదడుకు రక్ష… దానిమ్మ!..
దానిమ్మలోని పాలిఫెనాల్స్, పీచుచ పునికాల్టిన్ వంటివి కొలెస్ట్రాల్ స్ధాయులను తగ్గించి గుండె జబ్బు బారిన పడకుండా కాపాడతాయి.

Pomegranate
Pomegranate : ఆరోగ్యానికి దానిమ్మ గింజలు ఎంతో మేలు చేస్తాయి. దానిమ్మ గింజల్లో విటమిన్లు బి,సి,కెలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దానిమ్మ గింజల రూపంలో తీసుకోవచ్చు. అలా కాకున్నా జ్యూస్ గా చేసుకుని తాగవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా చూడటంతో పాటు కొన్ని ఇబ్బందుల నుండి రక్షణగా పనిచేస్తుంది.
దానిమ్మలో ఎలాజిక్ యాసిడ్, యాంతో సైకానిన్స్, పునికాల్టిన్ వంటి అరుదైన రసాయనాలు ఉన్నాయి. ముఖ్యంగా పునికాల్టిన్ మెదడులో వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా అల్జీమర్స్ , పార్కిన్సన్స్ జబ్బుల పెరుగుదల తగ్గించేలా చేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్ జబ్బుకు మెదడులో ప్పటికాలు పేరుకుపోవటం ప్రధానకారణం. వీటిని దానిమ్మ విడగొడుతున్నట్లు అధ్యయానాల్లో తేలింది.
దానిమ్మలోని పాలిఫెనాల్స్, పీచుచ పునికాల్టిన్ వంటివి కొలెస్ట్రాల్ స్ధాయులను తగ్గించి గుండె జబ్బు బారిన పడకుండా కాపాడతాయి. దీనిలోని పోషకాలు మలబద్ధకాన్ని నివారించి జీర్ణకోశ వ్యవస్ధ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. రోజుకి ఒక గ్లాసు దానిమ్మ రసం తీసుకుంటే పురుషులు, మహిళల్లో టెస్టోస్టీరాన్ స్ధాయులు పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో రుజువైంది. శృంగారంపై ఆసక్తి పెరగటానికి తోడ్పడుతుంది.
చర్మంపై ముడతలను తొలగించి చర్మం కాంతి వంతంగా మారేలా చేయటంలో దానిమ్మ గింజలు బాగా దోహదపడతాయి. శరీరంలో ఒత్తిడి హార్మోన్ గా చెప్పబడే కార్డిజోల్ స్ధాయులను దానిమ్మ రసం తగ్గిస్తున్నట్లు తేలింది. దానిమ్మ గింజలు కీళ్లవాతాన్ని ,ఆర్థరైటిస్ జబ్బును నయం చేస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం దానిమ్మ గింజలు తినటం వల్ల తగ్గుతుంది.