Red Okra : పోషలతో నిండిన ఎర్ర బెండ ! దీని ప్రత్యేకతలు తెలిస్తే?
ర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది

Red Okra :
Red Okra : బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని, లెక్కలు బాగా వస్తాయని చెబుతుంటారు. అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని పోషకాహార నిపుణులు సైతం దీనిని తినమని సూచిస్తుంటారు. పులుసు, కూర, ఫ్రై ఇలా బెండతో అనేక రకాల కూరలు వండుతారు. సాధారణంగా చాలా మందికి తెలిసినవి పచ్చని బెండకాలు. అయితే బెండకాయల్లో ఎర్రటి బెండకాయలు కూడా ఉన్నాయి. ఈ ఎర్రని బెండకాయల్లో అనేక పోషకాలు ఉన్నాయి. ఈ ఎర్ర బెండకాయలో ఆంథోసైనిన్‌లు మరియు ఫినాలిక్‌లు పుష్కలంగా ఉంటాయి. రెడ్ ఓక్రాను మెజెంటా, పర్పుల్ లేదా బుర్గుండి ఓక్రా అని కూడా అంటారు.
ఎర్ర బెండతో ఆరోగ్య ప్రయోజనాలు ; ఎర్ర బెండకాయలో 94% పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఉంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, అలాగే బలమైన 66% ఉప్పు కంటెంట్‌ను కలిగి ఉంటుంది, ఇది రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. అంతేకాకుండా 21% ఇనుము ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి సహాయం చేస్తుంది, కేవలం 5% ప్రోటీన్ శరీర జీవక్రియ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది.
ఎర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎర్ర బెండకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, విటమిన్ ఎ, చర్మాన్ని మరియు కళ్ళను సంరక్షిస్తుంది. విటమిన్ బి, అలాగే కాల్షియం మరియు పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్-రిచ్ లక్షణాలు , దీర్ఘకాలిక డైటరీ ఫైబర్ లకు ఎర్ర బెండ మూలంగా చెప్పవచ్చు. తరుచూ తింటే మలబద్ధకం లాంటి సమస్యలు రానేరావు. బరువు తగ్గడంతో సాయపడతాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి.