Falling Dreams : ఎత్తునుంచి పడిపోతున్నట్లు కలలు వస్తున్నాయా? కారణం ఏంటంటే…

ప్రతిరోజు కలలు వస్తుంటాయి. మెళకువ వచ్చేసరికి చాలామటుకు గుర్తుండవు. కొన్ని కలలు విపరీతంగా భయపెడతాయి. నిద్రలోంచి మేల్కొనేలా చేస్తాయి. ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు వచ్చే కలలు విపరీతంగా భయపెడతాయి. అలా ఎందుకు వస్తాయి?

Falling Dreams : ఎత్తునుంచి పడిపోతున్నట్లు కలలు వస్తున్నాయా?  కారణం ఏంటంటే…

Falling Dreams

Updated On : August 4, 2023 / 2:38 PM IST

Falling Dreams : రాత్రి వేళ కలలు రావడం సహజం. కొన్ని కలలు విచిత్రంగా ఉంటాయి. కొన్ని తెలియని ఆనందాన్ని ఇస్తాయి. కొన్ని భయపెడతాయి. ఆందోళన కలిగిస్తాయి. వెంటనే మెళకువ వచ్చి తిరిగి చాలాసేపు మేల్కొనేలా చేస్తాయి. కొన్ని కలల్లో ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు కల వస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెలకువ వచ్చిన వెంటనే ఇది కలా? అని శాంతిస్తాం. అసలు ఇలా ఎందుకు కలలు వస్తాయి? వాటి వెనుక అర్ధాలేంటి? తెలుసుకుందాం.

Dreams : కలలు ఎందుకు గుర్తుండవు ?

ఎత్తైన ప్రదేశాల నుంచి పడిపోతున్నట్లు కలలు రావడం సహా కొన్ని కలలు సాధారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. కొండ పైనుంచి పడిపోయినట్లు.. మంచి మీద నుంచి జారి కింద పడినట్లు కలలు వస్తుంటాయి. నిజానికి అలా అనుభూతి చెందుతాం. ఇలా ఎప్పుడైనా రావడం సహజం. తరచుగా ఇలాంటి కలలు వస్తున్నట్లైతే ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. పీడకలలు నిద్రకు సంబంధించిన రుగ్మతలు, ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) కారణం కావచ్చునట.

 

కొండ పైనుంచి మనల్ని ఎవరైనా నెట్టినట్లు అనిపించడం.. అనుకోకుండా కొండపై నుంచి పడిపోవడం వంటి కలలు రావడం వెనుక మీలో ఆత్మవిశ్వాసం లేదని చెప్పవచ్చునట. అలాగే విమానంలోంచి పారాచూట్ పైకి వెళ్లినట్లు.. సేఫ్టీ నెట్‌లోకి దూసుకెళ్లినట్లు కలలు రావడం భయానకం కాదట. అలా వస్తే మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారని సంకేతం కావచ్చునట. మొదటగా మీ కలలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అవి మర్చిపోవడాని కంటే ముందు గుర్తున్నంతవరకూ కల గురించి వివరంగా రాసుకోండి. కలలో పడిపోయిన తరువాత మెళకువ వస్తుంది. మీరు కలలో పడిపోతూ ఉపరితలాన్ని తాకబోతున్నారు అన్నప్పుడు మీ కాళ్లు కుదుపుకు గురవుతాయి. మిమ్మల్ని రక్షించే ఒక కదలికతో మేల్కొంటారు.

Dreams In Sleep : నిద్రలో కలలు వస్తున్నాయా! అసలు కారణం ఏంటంటే?

కలలో మరొకరు పడిపోతున్నట్లు కల వస్తే దాని సంబంధించి  శాస్త్రీయ పరిశోధన లేదట. మీకు తెలిసిన వారి జీవితం సరిగా లేదని ఆందోళన పడటం, ఎవరైనా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా విడిచిపెడుతున్నారనే భయం కావచ్చునట. కలలను ఎవరూ నియంత్రించలేరు. పడిపోతున్నట్లు వచ్చే కలలు ఒత్తిడికి సంబంధించినవి కాబట్టి ప్రశాంతంగా నిద్రపోవడం ఎలా అనే అంశాలపై దృష్టి పెట్టాలి. నిద్రపోయే ముందు శ్వాస వ్యాయామాలు చేయడం మంచిది. నిద్రకు ముందు మానసిక ఒత్తిడిని కలిగించే అంశాలను గుర్తు చేసుకోకండి. పడకగదిలో ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తీసివేయండి. పడిపోతున్నట్లుగా కలలు తగ్గకపోయినా పగటిపూట కూడా అవి ఇబ్బంది పెడుతున్నా చికిత్స తీసుకోవాలి. అనుభవం కలిగిన మానసిక నిపుణులు మీ కలలను ఎదుర్కోవడంలో ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయం చేస్తారు.

 

పీడకలలు దీర్ఘకాలంగా వస్తుంటే ఒత్తిడి లేదా నిద్రలేమికి సంకేతం. కలలు గుర్తున్నా లేకపోయినా రోజులో రాత్రి నాలుగు నుండి ఆరుసార్లు కలలు కంటారట. గాఢ నిద్రలో ‘ర్యాపిడ్ ఐ మూమెంట్’ (REM) దశలో ఈ కలలు వస్తుంటాయి. కలలకు ల్యాజిక్ అంటూ ఉండదు. అర్ధం లేకుండా వస్తుంటాయి. అసలు కలలు ఎందుకు కంటున్నామనే అంశంపై అర్ధం ఏమిటో సైన్స్ ఇంకా ఖచ్చితంగా చెప్పలేదు. నిరంతరం పీడకలలు, ఆందోళన, నిద్రలేమి సమస్యలు వేధిస్తుంటే శారీరక లేదా మానసిక వైద్యుల్ని సంప్రదిస్తే ఉపశమనం కలుగుతుంది.

Dream Controlling Chip : కలల్ని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మిషన్‌తో తలకు రంధ్రం చేసి చిప్ పెట్టుకున్న వ్యక్తి .. ఆ తరువాత ఏమైందంటే