Oral Romance : ఓరల్ సెక్స్‌తో ఆ భయంకరమైన జబ్బు ఖాయం? నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Oral Romance : అవాంఛిత గర్భధారణ ప్రమాదాన్ని అధిగమించడానికి ఓరల్ సెక్స్ చాలా సేఫ్ అని నమ్ముతారు. అయితే, ఓరల్ సెక్స్ కారణంగా ఆ జబ్బు బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Oral Romance : ఓరల్ సెక్స్‌తో ఆ భయంకరమైన జబ్బు ఖాయం? నిపుణుల అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Oral Romance (Photo : Google)

Updated On : April 30, 2023 / 7:55 PM IST

Oral Romance : ఓరల్ సెక్స్.. శృంగారంలో ఇదో టైప్. నోటితో చేసే శృంగారాన్ని ఇష్టపడేవారిలో చాలామందే ఉన్నారు. శృంగారం మరింత రక్తి కట్టాలంటే ఓరల్ సెక్స్ చేయాల్సిందే అనే భావన ఉంది. చాలామంది ఓరల్ సెక్స్ తర్వాతే రతి క్రీడలో పాల్గొంటారు. కొందరేమో కేవలం ఓరల్ సెక్స్ తోనే సంతృప్తిపడతారు. ఓరల్ సెక్స్ ని కొందరు మహిళలు ఎంజాయ్ చేస్తారు, మరికొందరు అస్సలు ఇష్టపడరు.

ఇక, అవాంఛిత గర్భధారణ ప్రమాదాన్ని అధిగమించడానికి ఓరల్ సెక్స్ చాలా సేఫ్ అని నమ్ముతారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ఓరల్ సెక్స్ గురించి అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. ఓరల్ సెక్స్ ఆరోగ్యానికి మంచిది కాదనే భయాలూ లేకపోలేదు.

Also Read..Pregnancy : గర్భధారణ సమయంలో సాధారణ సమస్యలు ! కారణాలు, వాటిని ఎదుర్కోవటానికి చిట్కాలు..

ఇకపోతే, తాజాగా ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అదేమిటంటే.. ఓరల్ సెక్స్ తో గొంతు క్యాన్సర్ బారిన పడే రిస్క్ ఉందట. నిపుణుల అధ్యయనం ప్రకారం, ఓరల్ సెక్స్‌లో నిమగ్నమైన వ్యక్తులు గొంతు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉన్నట్టు గుర్తించారు. ఇది చాలావరకు చికిత్స చేయగలిగినప్పటికీ, ఇది రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుందని, అందుకే టీకాలు వేయడం ముఖ్యమని వెల్లడించారు.

యూకే క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం, 70 శాతం గొంతు క్యాన్సర్ కేసులు HPVతో (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) ముడిపడి ఉన్నాయి. ఇది 40-50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల్లో, ధూమపానం చేయని వారిలో ఎక్కువగా గుర్తించబడింది.

Also Read..Bubble Gum : మీ శరీరం బబుల్ గమ్‌ను జీర్ణం చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా?

వ్యాధి లక్షణాలు:
గొంతులో నొప్పి.
నయం కాని అల్సర్.
మాట్లాడటంలో సమస్యలు.
చెడు శ్వాస.
అనూహ్యమైన వెయిట్ లాస్.
మింగడంలో సమస్యలు.
గొంతు లేదా నోటిలో ఎరుపు, తెలుపు ప్యాచ్ లు.
మెడలో వాపు.

HPV అంటే..
HPV అనేది వైరస్ ల సాధారణ సమూహాన్ని వివరించడానికి ఉపయోగించే పదం. చాలా సందర్భాలలో ఇది ఎలాంటి సమస్యలను కలిగించదు. ఈ వైరస్.. పురుషాంగం, యోని చుట్టూ నొప్పిలేని గడ్డలు ఏర్పడటానికి కారణం అవుతుంది. HPV.. జననేంద్రియ, నోరు, గొంతు ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ కింది వాటి కారణంగా HPV వచ్చే అవకాశం ఉంది.

* ఓరల్ సెక్స్
* వెజైనల్ సెక్స్
* షేరింగ్ సెక్స్ టాయ్స్
* జననేంద్రియ ప్రాంతం స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్

HPV ముఖ్య పరిణామాలు:
* Anal cancer
* Penile cancer
* Cervical cancer
* Vaginal cancer
* Vulval cancer