Fungal Infections : ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు సింపుల్ హోం రెమెడీస్!

ఏదైనా ఇంటి నివారణ పద్దతులు,ఇతర ఔషధాలను ఉపయోగించే ముందు ఇన్ ఫెక్షన్ సోకిన ప్రదేశాన్ని నీరు, సబ్బుతో రోజుకు రెండుసార్లు శుభ్రం చేయండి. ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చేస్తుంది.

Fungal Infections : ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు సింపుల్ హోం రెమెడీస్!

Fungal Infections

Updated On : June 11, 2022 / 9:37 AM IST

Fungal Infections : చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. పరిశుభ్రత సరిగా పాటించకపోవటం, తేమ, వేడి ఉష్ణోగ్రతలు ఫంగస్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కొన్ని సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్లలో దద్దుర్లు, బొబ్బలు, డైపర్ రాష్, అథ్లెట్స్ ఫుట్, రింగ్ వార్మ్, చర్మంపై పొలుసులు వంటివి ఉన్నాయి. సహాజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ఫంగల్ ఇన్ ఫెక్షన్లు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ప్రస్తుతం మార్కెట్‌లో అనేక మందులు , యాంటీ ఫంగల్ లోషన్‌లు ఉన్నప్పటికీ, చాలా వరకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు ఇంటి చికిత్సలకు బాగా స్పందిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారణకోసం గృహ చిట్కాల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తేనె ; తేనె అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్సలలో ఒకటి, ఎందుకంటే ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. ఇది చర్మ వ్యాధులకు కారణమయ్యే ఫంగస్, బ్యాక్టీరియాను చంపడంలో శక్తివంతమైనది. ఫంగల్ఇన్ ఫెక్షన్ ఉన్న ప్రాంతంలో ముడి తేనెను పూయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

పెరుగు ; పెరుగు మరియు ఇతర ప్రోబయోటిక్స్ అనేక ఫంగల్ వ్యాధుల నివారించటంలో తోడ్పడే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది. పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్ యొక్క మంచి మూలంగా చెప్పవచ్చు. ప్రయోజనకరమైన బ్యాక్టీరియా యొక్క పెద్ద స్థాయిలతో ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇందుకుగాను వైద్యుల సూచనలు తీసుకోవటం మంచిది.

వెల్లుల్లి ; వెల్లుల్లి అత్యంత ప్రభావవంతమైన యాంటీ ఫంగల్ , యాంటీ బాక్టీరియల్ గా చెప్పవచ్చు. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఆలివ్ నూనెతో, మిశ్రమాన్ని సిద్ధం చేసుకుని చర్మ సంబంధిత ఇన్ ఫెక్షన్లు ఉన్నచోట రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సబ్బు నీరు; ఏదైనా ఇంటి నివారణ పద్దతులు,ఇతర ఔషధాలను ఉపయోగించే ముందు ఇన్ ఫెక్షన్ సోకిన ప్రదేశాన్ని నీరు, సబ్బుతో రోజుకు రెండుసార్లు శుభ్రం చేయండి. ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చేస్తుంది. సబ్బు, నీరు ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను పూర్తిగా తొలగించలేకపోయినా, వ్యాప్తి తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ; యాపిల్ సైడర్ వెనిగర్‌లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటిలో రెండు టీస్పూన్లు కలుపుకుని త్రాగవచ్చు. లేదా దానిలో ముంచిన దూదితో మీ చర్మంపై రాసుకోవచ్చు. ఇలా రోజుకు 3-4 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేప ఆకులు ; వేప ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మానికి చాలా మేలు చేస్తాయి. వేప నీటిని ప్రభావిత ప్రాంతంలో పూయడం ద్వారా శిలీంధ్ర వ్యాధులు నయమవుతాయి. వేప నీటిని తయారు చేయడానికి, వేప ఆకులను 3-5 నిమిషాలు ఉడకబెట్టాలి. తరువాత ఆనీటిని ఉపయోగించుకోవాలి.

టీ ట్రీ ఆయిల్ ; టీ ట్రీ ఆయిల్ స్వతహాగా యాంటీ ఫంగల్ అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. కొబ్బరి, ఆలివ్ నూనె ఏదైనా ఆయిల్‌తో దీన్ని మిక్స్ చేసి, ఇన్ ఫెక్షన్ సోకిన ప్రాంతానికి రోజుకు 3 నుండి 4 సార్లు అప్లై చేయండి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అత్యంత శక్తివంతమైన సహజ చికిత్సలలో ఒకటి.

కొబ్బరి నూనె ; కొబ్బరి నూనె ఒక శక్తివంతమైన మూలికా ఔషదంగా చెప్పవచ్చు. చర్మానికి ఇది ఎంతో మేలు కలిగిస్తుంది. స్కాల్ప్ ,రింగ్‌వార్మ్‌ను నయం చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. చర్మంపై రోజుకు 2,3సార్లు అప్లై చేయటం ద్వారా ఇన్ ఫెక్షన్లను నివారించుకోవచ్చు.

కలబంద ; అలోవెరా జెల్ ఉపయోగించి అనేక ఇన్ ఫెక్షన్లకు చికిత్స చేయవచ్చు. కలబంద అనేది చర్మసంబంధిత వ్యాధులకు సహజ చికిత్సగా ఉపయోగపడుతుంది.. చర్మానికి ఉపశమనం కలిగించడమే కాకుండా, వ్యాధిని నయం చేస్తుంది.

పసుపు; పసుపులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. కొద్దిగా నీరు కలిపిన తర్వాత ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. శరీరం యొక్క అంతర్గత సమస్యలను నివారించుకునేందుకు , పసుపు పొడిని వేడి నీటిలో కలిపి టీలా తయారు చేసుకుని తాగాలి. పసుపు దాదాపు ప్రతి భారతీయ వంటగదిలో కనిపిస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సులభమైన గృహ చికిత్సలలో ఒకటి.

అల్లం ; అల్లం, అల్లం టీ రూపంలో తీసుకోవచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి అద్భుతమైన మార్గం.

నిమ్మకాయ నూనె ; లెమన్‌గ్రాస్‌లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఫంగల్ ఇంజెక్షన్‌ను నయం చేయడానికి ఇంటి చికిత్సలలో ఒకటిగా ఉపయోగించవచ్చు. లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను క్యారియర్ ఆయిల్‌తో కలిపి, కాటన్ బాల్తో రోజుకు రెండుసార్లు ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.