Cigarette Smoking Extinction : 2050నాటికి ‘సిగరెట్’ అంతరించిపోనుంది.. ఎందుకో తెలుసా?
సిగరెట్... భవిష్యత్తులో కనుమరుగైపోనుంది. చరిత్రలో క్రమంగా కలిసిపోనుంది. వచ్చే మూడు దశాబ్దాల కాలంలో సిగరెట్ తాగేవారి సంఖ్య జీరోకి పడిపోనుందని ఓ కొత్త నివేదిక వెల్లడించింది.

Smoking Headed For Extinction
Smoking Headed for Extinction : సిగరెట్… భవిష్యత్తులో కనుమరుగైపోనుంది. చరిత్రలో క్రమంగా కలిసిపోనుంది. వచ్చే మూడు దశాబ్దాల కాలంలో సిగరెట్ తాగేవారి సంఖ్య జీరోకి పడిపోనుందని ఓ కొత్త నివేదిక వెల్లడించింది. 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సిగరెట్ వినియోగం భారీగా తగ్గిపోనుందని పేర్కొంది. రానున్న రోజుల్లో సిగరెట్ తాగేవారంతా మానేయడం లేదా ప్రత్యామ్నాయ ప్రొడక్టుల వైపు మారిపోయే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అమెరికాలో 2050 నుంచి సిగరెట్ స్మోకింగ్ అంతరించిపోనుంది.
యూరప్, ఆస్ట్రేలియా సహా లాటిన్ అమెరికాలో సిగరెట్ కనుమరుగైనుంది. గత దశాబ్దకాలంగా సిగరెట్ స్మోకింగ్ వినియోగం తగ్గిపోవడం కొనసాగుతోందని సిటీగ్రూపు ఇంక్
విశ్లేషకులు అడమ్ స్పియిల్ మ్యాన్ పేర్కొన్నారు. రాబోయే సిగరెట్ ప్రత్యామ్నాయ ప్రొడక్టులు గట్టి పోటీనివ్వనున్నాయని తెలిపారు. గత 20 ఏళ్లలో ప్రస్తుతం స్మోకింగ్ చేస్తున్న
యువకుల సంఖ్య దాదాపు మూడొంతులు పడిపోయింది.
సిగరెట్ తాగే పురుషుల్లో రికార్డు స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారిగా నివేదిక పేర్కొంది. రాబోయే దశాబ్దకాలంలో సిగరెట్ వినియోగం నుంచి క్రమంగా తగ్గిపోతుందనే సంకేతాలు మొదలయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సిగరెట్లకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రొడక్టుల్లో IQOS హీటెడ్ టొబాకో డివైజ్ లు అందుబాటులోకి రానున్నాయి. అల్టారియా గ్రూపు ఇంక్. రిపోర్టు ప్రకారం.. 82శాతం బిజినెస్ సిగరెట్ల నుంచే వస్తోంది. ఇతర ప్రత్యామ్నాయ ప్రొడక్టులపై పెట్టుబడులు ఉన్నప్పటికీ సిగరెట్ డిమాండ్ తగ్గలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటోంది.

వచ్చే జనరేషన్ ప్రొడక్టుల్లో నికోటిన్ వినియోగం చాలావరకు మార్కెట్లో నెమ్మదిగా తగ్గిపోనుంది. చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాల్లో మాత్రం 2050లో కూడా సిగరెట్ స్మోకింగ్ సాధారణంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్స్ దృష్టా పరిశీలిస్తే.. ప్రపంచంలో సిగరెట్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందని కచ్చితంగా అంచనా వేయలేమంటున్నారు.