Ridge Gourd : కాలేయానికి మేలు చేసే బీరకాయ
బీరకాయలో విటమిన్ సి, ఐరన్ రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థయామిన్ తోపాటు అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి.

Ridge Gourd
Ridge Gourd : కూరగాయల్లో బీరకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. బీరకాయను ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బీరకాయను కూరగాను, పచ్చడిగాను చేసుకోవచ్చు. తీగజాతికి చెందిన బీరకాయ సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే కూరగాయ. ఉదర సంబంధిత వ్యాధులను నయం చేయటంలో దీనిని మించింది లేదు. సులభంగా జీర్ణమౌతుంది. వాత శరీరాలను కలిగి ఉన్న వారికి తప్ప ఇది మిగిలిన వారందరికి ఎంతో ఉపకరిస్తుంది.
బీరాకు రసం పైత్యాన్ని హరిస్తుంది. రక్తంలోని మలినాలను తొలగించేందుకు తోడ్పడుతుంది. బీరకాయలో అనేక సుగణాలు ఉన్నాయి. చక్కెర వ్యాధిని నివారిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. రోగనిరోధక శక్తి పెంపొందేలా చేస్తుంది. చర్మసౌందర్యానికి ఇది చక్కగా ఉపకరిస్తుంది. చర్మంపై ముడుతలు, మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. కంటి చూపుకు బీర ఎంతగానో ఉపయోగపడుతుంది.
బీరకాయలో విటమిన్ సి, ఐరన్ రిబోఫ్లేవిన్ , మెగ్నీషియం, థయామిన్ తోపాటు అనేక రకాల ఖనిజలవణాలు ఉంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్ కెలరీలు తక్కవగా ఉంటాయి. బరువుతగ్గాలనుకునే వారు బీరను ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇందులో సెల్యులోజ్, నీటి శాతం ఎక్కవగా ఉంటుంది. మలబద్ధకం, ఫైల్స్ సమస్యతో బాధపడేవారు బీరకాయ తినటం మంచిది.
కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజు ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ మందులా పనిచేస్తుంది. బీరకాయల్లోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలు.