Stay Healthy In Winter : చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతోపాటు, వ్యాయామాలు అవసరమే!
చలికాలంలో మెదడులోని సెరటోనిన్ అనే ఫీల్‌గుడ్ రసాయనం స్థాయులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మరి, దీన్ని పెంచుకోవడానికి కార్బోహైడ్రేట్లు నిండి ఉన్న ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. అయితే ఇందులో చక్కెరలు అధికంగా ఉండే సాధారణ కార్బోహైడ్రేట్లు కాకుండా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా నిండి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.

Staying healthy during winters requires good food and exercise!
Stay Healthy In Winter : చలికాలంలో ఉష్ణోగ్రతలలోని మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ ఆ ప్రభావం ఆరోగ్య పరిస్ధితిపై పడుతుంది. చలి తీవ్రతకు చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణులు, వృద్ధులు ఆరోగ్యపరంగా పలు సమస్యలనుఎదుర్కొంటున్నారు. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. చలికాలంలో ఎక్కువగా బయట తిరగకూడదు.
చలికాలంలో వేడివేడి ఆహారాలను తీసుకోవటం మంచిది. ఇంట్లో కాకుండా బయటి పదార్థాలను, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు. విటమిన్ ‘డి’ కోసం చేపలు, గుడ్లు వంటివి ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే నిపుణుల సలహా మేరకు విటమిన్ ‘డి’ సప్లిమెంట్స్‌ని కూడా తీసుకోవడం మంచిది. సూర్యోదయం తర్వాత దాదాపు ఉదయం ఎనిమిది గంటలలోపు వచ్చే లేలేత సూర్యకిరణాల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఉదయాన్నే కాసేపు ఎండలో నిల్చోవంటం మంచిది.
చలికాలంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ కాలంలో కాస్త చల్లటి పదార్థం లేదంటే శరీరానికి పడనిది.. ఇలా ఏది తిన్నా జలుబు, దగ్గు.. వంటి పలు అనారోగ్యాలు త్వరగా దరిచేరతాయి. ఇందుకోసం క్యాబేజీ, బ్రకలీ, నిమ్మజాతి పండ్లు, చిలగడ దుంప.. వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పదార్థాల్ని ఆహారంగా తీసుకోవాలి. అలాగే చేపలు, గుడ్లు, మాంసం, పాలు, గింజలు, తృణధాన్యాలు.. వంటి జింక్ అధికంగా లభించే పదార్థాల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే వేడివేడిగా ఓ కప్పు గ్రీన్‌టీ తాగడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.
చలికాలంలో మెదడులోని సెరటోనిన్ అనే ఫీల్‌గుడ్ రసాయనం స్థాయులు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మరి, దీన్ని పెంచుకోవడానికి కార్బోహైడ్రేట్లు నిండి ఉన్న ఆహార పదార్థాల్ని తీసుకోవాలి. అయితే ఇందులో చక్కెరలు అధికంగా ఉండే సాధారణ కార్బోహైడ్రేట్లు కాకుండా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా నిండి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.. దీంతో ఎక్కువ సమయం వరకు శరీరంలో శక్తి స్థాయులు కోల్పోకుండా చూసుకోవచ్చు.
చలికాలంలో శరీరానికి వ్యాయామం తప్పనిసరి. దీనివల్ల జలుబు, దగ్గు.. వంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది. అంతేకాదు.. ఈ కాలంలో శరీర బరువు క్రమంగా పెరుగుతారు కాబట్టి మన శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆటలాడడం ఇలా శరీరానికి పని చెప్పడం తప్పనిసరి. తాజా కూరగాయలు, మొలకెత్తిన గింజలు, బీన్స్, మాంసం.. వంటి పలు పదార్థాలతో వేడివేడిగా సూప్స్ తయారుచేసుకొని తీసుకోవాలి. తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.