Cracked Heels : పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారా? పైనాపిల్ తో ఇలా చేసి చూడండి!

పైనాపిల్‌ లో ఉండే ఆమ్లాలు పాదాల‌పై పేరుకుపోయిన మృత‌క‌ణాలు తొల‌గిపోయేలా చేస్తాయి. పాదాల‌పై పేరుకుపోయిన మృత‌క‌ణాలను తొలగిపోయేలా చేస్తుంది. ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల గ‌రుకుగా ఉండే చ‌ర్మం అంతా తొల‌గిపోయి మృదువుగా ఉండే చ‌ర్మం బ‌య‌ట‌కు వ‌స్తుంది.

Cracked Heels : పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారా? పైనాపిల్ తో ఇలా చేసి చూడండి!

Cracked heels

Cracked Heels : పాదాల అడుగునా చ‌ర్మంపై మృత క‌ణాలు పేరుకుపోయి పాదం గరుకుగా మారుతుంది. అంతేకాకుండా పగుళ్లు ఏర్పడతాయి. చలికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. ప‌గుళ్లు ఏర్పడటం కారణంగా కొన్ని సందర్భాల్లో మంట కలుగుతుంది. చలికాలమే కాదు ఇంట్లో నీటిలో ఎక్కువ సేపు గడిపే పనులు చేస్తుండటం వల్ల పాదాల్లో సమస్యలు వస్తాయి. బట్టలు ఉతకడం, సామాన్లు కడగడం ఇలాంటి పనులు పాదాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి పనులు చేసేటప్పుడు పాదాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడిసి ఉండడం వల్ల సమస్యలు వస్తాయి.

పాదాల ప‌గుళ్ల‌ను నివారించే వాటిలో పైనాపిల్ పండు ఎంతగానో దోహదపడుతుందని సౌందర్యనిపుణులు చెబుతున్నారు. పైనాపిల్‌ ఎక్కువ‌గా ఆమ్లా త‌త్వాన్ని క‌లిగి ఉంటుంది. పాదాల ప‌గుళ్ల‌తో బాధ‌ప‌డే వారు ఈ పైనాపిల్‌ ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల సమస్య నుండి బయటపడవచ్చు. పైనాపిల్‌ ను చిన్నచిన్న ముక్క‌లుగా కోసి మెత్త‌గా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని పాదాల అడుగు భాగానికి ప‌ట్టించాలి. 45 నిమిషాల పాటు పాదాల‌ను అలాగే వదిలేయాలి.

పైనాపిల్‌ లో ఉండే ఆమ్లాలు పాదాల‌పై పేరుకుపోయిన మృత‌క‌ణాలు తొల‌గిపోయేలా చేస్తాయి. పాదాల‌పై పేరుకుపోయిన మృత‌క‌ణాలను తొలగిపోయేలా చేస్తుంది. ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల గ‌రుకుగా ఉండే చ‌ర్మం అంతా తొల‌గిపోయి మృదువుగా ఉండే చ‌ర్మం బ‌య‌ట‌కు వ‌స్తుంది. పాదాల ప‌గుళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా చేసిన తరువాత పాదాల‌కు కొబ్బ‌రి నూనె రాసుకుని కొద్ది సేపు మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత పాదాల‌ను శుభ్రం చేసుకునే బ్ర‌ష్ తో లేదా రాళ్ల‌తో పాదాల‌ను రుద్ద‌డం వ‌ల్ల పాదాల‌పై మృత‌క‌ణాలు పేరుకోకుండా చూసుకోవచ్చు.

పాదాలు తడిగా అయిపోతాయి. అదే విధంగా దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్‌కి కూడా దారి తీస్తాయి. కాబట్టి మీరు చెప్పులు లేదంటే షూని తప్పకుండా ధరించాలి. యాంటీ ఫంగల్ పౌడర్ రాసుకోవడం, పాదాలని పొడిగా ఉంచుకోవాలి. పాదాలను కడిగిన వెంటనే తుడిచి ఆ తర్వాత షూస్ లేదా చెప్పులు వంటివి ధరించాలి. బయటికి వెళ్లి వచ్చిన వెంటనే పాదాలను శుభ్రంగా కడుక్కోవడం, యాంటీ సెప్టిక్‌తో క్లీన్ చేసుకోవాలి.