Tamarind Leaves : రక్తహీనతను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచే చింత చిగురు!
చింత చిగురులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడుతుంది. వణుకుడు జర్వం తగ్గించటంలోనూ, గొంతునొప్పి, మంట, వాపుని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది.

Temarind Leaves (1)
Tamarind Leaves : దక్షిణ భారతదేశపు వంటకాల్లో చింత ప్రధాన పాత్ర పోషిస్తుంది. చింతాకు, చింత చిగురును ఆకు కూరలాగా వంటలో ఉపయోగిస్తారు. చింతచిగురును పప్పుతో కలపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. అంతా చింతచిగురు పప్పును తినేందుకు ఇష్టపడతారు. చింత పువ్వులతో పప్పు, చట్నీ చేసుకుంటారు. చింత చిగురుతో రొయ్యలు కలిపి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. వంకాయల్లో చింత చిగురు వేసి కూరగా చేసుకుంటారు. చింత చిగురు ఎక్కవగా దొరికిన సందర్భంలో కచ్చా..పక్కాగా రుబ్బుకుని వడల అకారంలో చేసి ఎండ బెట్టుకోవాలి. ఎండిన వాటిని డబ్బాలో భద్రపరుచుకోవాలి. నెలరోజులకు పైగా నిల్వ ఉంటాయి. కూరల్లో చింతపండుకు బదులు వీటిని వేసుకోవచ్చు.
చింత చిగురు కోసం నీడలో అరబెట్టి పొడిలా చేసుకుని కూరల్లో వాడుకోవచ్చు. ఇది రక్తహీనతను నివారిస్తుంది. రక్తం పెరిగేలా చేస్తుంది. చింత చిగురు కామెర్ల నివారణకు ఉపయోగపడుతుంది. మూల వ్యాధులకు ఉపశమనం కలిగిస్తుంది. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటినాగా పనిచేసి విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. మల బద్ధకం సమస్యను తొలగిస్తుంది. ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వారికి చింతపండు బాగా ఉపకరిస్తుంది.
చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు చింత చిగురు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
చింత చిగురులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగటానికి దోహదపడుతుంది. వణుకుడు జర్వం తగ్గించటంలోనూ, గొంతునొప్పి, మంట, వాపుని తగ్గించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. చింత చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. ఆర్ధరైటీస్ సమస్యతో బాధపడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్ధాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. నేత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కీళ్ళవాపు సమస్యల నివారణకు ఉపయోగపడుతుంది.