Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!

కాలేయ సమస్యలే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగించటానికి , రక్తహీనత పోగొట్టటానికి యాంటీ ఎనామిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!

Punarnava

Updated On : July 3, 2022 / 3:33 PM IST

Punarnava : పెరటిలో కనిపించే కలుపు మొక్కలో అనేక అద్బుతమైన ఔషధగుణాలు ఉన్నాయని తెలిస్తే నిజంగా ఆశ్ఛర్యం కలుగుకమానదు. ఆయుర్వేద వైద్యంలో కీలకమైన ఔషధంగా చెప్పబడే పునర్నవ అనేక అనారోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా కాలేయాన్ని రక్షించటంలో పుర్నవను మించింది లేదని నిపుణులు చెబుతున్నారు. పునర్నవ అంటే తిరిగి లేవటం అని అర్ధంగా చెబుతుంటారు. మనిషి తీవ్రమైన కాలేయ జబ్బు బారిన పడ్డా దీనిని ఔషధ రూపంలో వినియోగించటం వల్ల తిరిగి మామూలు ఆరోగ్యవంతునిగా తయారవుతాడని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మద్యం సేవించడం అలవాటు కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కలుషితమైన ఆహారం, నీరు కారణంగా కూడా కాలేయ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీంతో కాలేయం చెడిపోవడం సరిగ్గా పనిచేయకపోవడం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా కామెర్లతో, జ్వరంతో బాధపడుతున్నా కూడా కాలేయం పని తీరు సన్నగిల్లుతుంది. కాలేయ సమస్యలు వచ్చిన వెంటనే వాటికి తగిన చికిత్సను పొందాల్సిన అవసరం ఉంది.. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదంగా పరిణమిస్తుంది.

పునర్నవ మొక్కను ఉపయోగించి మనం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలేయ సమస్యలతో బాధపడే వారికి పునర్నవ మంచి ఔషదంగా ఉపయోగపడుతుంది. కాలేయాన్ని సంరక్షించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. పునర్నవ మొక్క ఆకులను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ తేనెను కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగిన తరువాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల కాలేయ సమస్యలు అన్నీ తగ్గి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

కాలేయ సమస్యలే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగించటానికి , రక్తహీనత పోగొట్టటానికి యాంటీ ఎనామిక్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఉబ్బసంతో బాధపడే వారికి శ్వాస మార్గంలో శ్లేష్మం తొలగించటానికి ఉపకరిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరచటంలో దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. రుతు సమయంలో వచ్చే నొప్పి వంటి రుగ్మతలను తగ్గించుకునేందుకు పునర్నవను ఉపయోగించవచ్చు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించి అందించటం జరిగింది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.