2023 Last Date : ఈ ఏడాది చివరి రోజు చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా?

ఈ ఏడాది చివరి రోజు చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు. శుభసూచకంగా కూడా భావిస్తున్నారు. ఇంతకీ 12/31/23 ప్రత్యేకత ఏంటి? చదవండి.

2023 Last Date : ఈ ఏడాది చివరి రోజు చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా?

2023 Last Date

Updated On : December 19, 2023 / 5:28 PM IST

2023 Last Date : 2023 వ సంవత్సరానికి బైబై చెప్పడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఈ సంవత్సరం చివరి తేదీ చాలా ప్రత్యేకమైనదని మీకు తెలుసా?

Year End Roundup 2023 : 2023 లో టాలీవుడ్‌కి కలిసిరాని రీమేక్‌లు

2023 వ సంవత్సరానికి బైబై చెప్పి 2024 కి వెల్కం చెప్పడానికి మరికొన్ని రోజులు మాత్రమే వెయిట్ చేయాలి. అయితే ఈ ఏడాది చివరి తేదీని గమనించారా? 12/31/23.. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెల, తేదీ, సంవత్సరం వరుసగా గమనిస్తే ‘123123’ అని కనిపిస్తుంది. ఈ నంబర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. 123 అనే అంకెలు న్యూమరాలజీ ప్రకారం కొత్త ప్రారంభానికి సూచనగా చెప్తారు. 123, 123123 ఈ వరుస క్రమ సంఖ్యలని దేవతల సంఖ్యలుగా చెబుతారు. ఇవి విశ్వం నుండి సందేశం పంపినట్లుగా జనం నమ్ముతారు.

న్యూమరాలజీ ప్రకారం ప్రతి నంబర్‌కి నిర్ధిష్టమైన అర్ధం ఉంటుంది. 123 లోని ప్రతిసంఖ్యకు ఎలాంటి అర్ధం నిర్వచించారో తెలుసుకుందాం. నంబర్ 1 ఎప్పుడూ కొత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది. నంబర్ 2 భావోద్వేగాలను, ఆనందకరమైన సమయాన్ని చెబుతుంది. నంబర్ 3 ఈ సంఖ్య ఏదైనా నేర్చుకోవడం లేదా ఎదుగుదలను సూచిస్తుంది. ఇక 123 ని కలిపి చూస్తే (1+2+3) ఇది 6 కి సమానం. 6 సమతుల్యత, ప్రేమలను సూచిస్తుంది. కాబట్టి 12/31/23 తేదీలో సానుకూలమైన అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఇక న్యూమరాలజీ ప్రకారం మొదట 12 స్థిరమైన శక్తికి నిదర్శనం. 31 విషయం అనుకున్నట్లుగా జరగట్లేదు అనే అర్ధాన్ని సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలని అర్ధం. 23 స్థిరమైన శక్తికి సంబంధించినది.

Year End Roundup 2023 : ఫ్యాన్స్‌కు నిరాశ‌.. 2023లో థియేటర్లలో కనపడని తెలుగు హీరోలు

2023 వ సంవత్సరం నుండి 2024 సంవత్సరానికి మారుతున్న సందర్భంలో రెండు సంవత్సరాలకు కూడా అర్ధం ఉంది. 2023 సత్యాన్ని సూచిస్తుంది. 2024 శక్తి, మరియు ప్రకాశాన్ని సూచిస్తుంది. ఇవన్నీ న్యూమరాలజీ ప్రకారం చెప్పబడినవి. కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది తరుణం కాబట్టి ఈ తేదీని అందరూ శుభసూచకంగా భావిస్తున్నారు. ఈ తేదీకి సంబంధించిన వీడియోలు, న్యూస్, మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.