Touch the feet of elders : పెద్దవారి పాదాలకు ఎందుకు నమస్కారం చేస్తారు?
పెద్దవారు కనపించగానే వారి పాదాలను తాకి నమస్కారం చేయడం మన సంప్రదాయం. అయితే ఇలా చేయడం వెనుక వారిని గౌరవించడంతో పాటు శాస్త్రీయమైన కోణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే?

Touch the feet of elders
Touch the feet of elders : ఇంట్లో వారే కాదు.. పెద్దవారు ఎవరు కనిపించినా పాదాలకు నమస్కారం చేస్తాం. ఇది భారతదేశంలో ఎక్కువగా కనిపించే సంప్రదాయం. ఇంట్లో పెద్దవారి నుంచి పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకుంటాం. అయితే ఎందుకు అలా చేస్తారు? ఇందులో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
Laughter Benefits : బీపీని దూరం చేయటంతో పాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే నవ్వు !
కొంతమంది ప్రతిరోజు మేల్కొన్న వెంటనే తాతయ్య, నానమ్మ లేదంటే తల్లిదండ్రుల పాదాలకు మొక్కుతారు. రాత్రి పడుకునే ముందు కూడా ఇలా చేస్తారు. ఇలా చేయడం వల్ల గొప్ప శక్తి లభిస్తుందని, గొప్ప అనుభూతి కలుగుతుందని మహాభారతంలో కూడా చెప్పబడింది. పెద్దవారి పాదాలను తాకడం వారికి ఇచ్చే గౌరవంగా భావిస్తాం. ఋషులు కూడా పాదాలను తాకడం వల్ల ప్రయోజనకరమైన నాలుగు అంశాలు చెప్పారు. బలం, బుద్ధి, జ్ఞానం, కీర్తి కలుగుతాయట. ఆధునిక కాలంలో పాదాలకు మొక్కడం అంటే ఆయురారోగ్యాలు, అదృష్టము, జ్ఞానము అని చెబుతారు. అయితే పాదాలను తాకడం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.
అయితే అసలు పెద్దవారి పాదాలకు ఎలా నమస్కారం పెట్టాలి? అంటే దానికి ఓ పద్ధతి ఉంది. మోకాళ్లను వంచకుండా శరీరం పై భాగాన్ని మాత్రమే వంచి పెద్దల పాదాలను తాకేలా రెండు చేతుల మధ్యలో తల ఉంచాలి. ఎడమ చేతి వేళ్లు వారి కుడి పాదాన్ని, కుడి చేతి వేళ్లు వారి ఎడమ పాదాన్ని తాకాలి. మీ తలపై వారు కుడిచేయిని ఉంచి ఆశీర్వాదం ఇవ్వాలి.
Anger Management : కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !
మనలో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీ ఉంటాయి. ఎడమవైపు పాజిటివ్, కుడివైపు నెగెటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. మనం పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు రెండు భాగాలు కలిసి పాజిటివ్‌గా మారతాయట. మెదడు నుంచి వచ్చే నరాలు శరీరమంతా ఉంటాయి. ఈ నాడులు చేతులు, కాళ్ల వేళ్ల వద్ద ఎండ్ అవుతాయి. మీ చేతివేళ్లు పెద్దవారి పాదాలను తాకినపుడు రెండు శరీరాలకు సంబంధించిన ఎనర్జీ అనుసంధానం అవుతుంది. అవి మనలో మరింత శక్తిని ప్రసరించేలా చేస్తాయట. పెద్దవారి పాదాలను తాకినపుడు మనలో ఉండే అహాన్ని పక్కన పెడతాం. అలా చేయడం వల్ల పెద్దవారి నుంచి వెలువడే శక్తి వారు ఆశీర్వదిస్తున్నప్పుడు వారి చేతుల నుంచి మనల్ని చేరుతుందట.
పాదాలను తాకినపుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు, హగ్ చేసుకున్నప్పుడు కూడా ఒక విధమైన శక్తి విడుదల అవుతుందని నమ్ముతారు. మీరు మంచి మనసున్న వ్యక్తి పాదాలు తాకినపుడు సరైన మార్గాన్ని ఎంచుకుంటారట. అంతేకాదు ఆరోగ్యానికి మేలు చేసేలా రక్తప్రసరణ జరుగుతుందట.
Loneliness : ఒంటరితనం నుంచి ఇలా బయటపడండి
పాదాలను మూడు రకాలుగా తాకాలట.. ముందుకు వంగి పాదాలను తాకడం, మోకాళ్లపై కూర్చుని పాదాలను తాకడం. మూడవది సాష్టాంగ ప్రణామం. ముందుకు వంగి పాదాలు తాకడం వల్ల నడుము, వెన్నెముక సాగుతుందని చెబుతారు. మోకాళ్లపై కూర్చుని పెద్దవారికి నమస్కారం చేసినపుడు మీ మోకాళ్లకు ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని కీళ్లన్నీ సాగుతాయి. సాష్టాంగ ప్రణామంతో శరీరంలో ఏ నొప్పులు ఉన్నా నయమవుతాయట. పెద్దల పాదాలను తాకి నమస్కరించడం వల్ల వారిని మనం గౌరవించడంతో పాటు మనకి ఇన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నమాట.