Drinks for Weight Loss : బరువు తగ్గించటంలో సహాయపడే 7 పానీయాలు ఇవే !

బరువు తగ్గడానికి అల్లం లెమన్ వాటర్ ని తీసుకోవచ్చు.వచ్చు. బరువు తగ్గడమే కాకుండా, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలకు ఈ పానీయం చాలా ఉపకరిస్తుంది. ఇది వాపు, తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.

Drinks for Weight Loss : బరువు తగ్గించటంలో సహాయపడే 7 పానీయాలు ఇవే !

lose weight

Updated On : November 20, 2023 / 11:27 AM IST

Drinks for Weight Loss : ఈ రోజుల్లో బరువు పెరగడం అనే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గంటల తరబడి ఆఫీసులు, పని ప్రదేశంలో కూర్చోవడం వల్ల అనేక సమస్యలకు గురవుతున్నారు. దీని వల్ల ఊబకాయం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఊబకాయం ఒక తీవ్రమైన సమస్య. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే సకాలంలో బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

READ ALSO : Sattu Pindi Benefits : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పిండి సూపర్ ఫుడ్ !

బరువును తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాలుగా ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది తిండి తినటం మానేస్తుంటే, మరికొందరు జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఈ పానీయాలను చేర్చుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బరువు తగ్గేందుకు సహాయపడే పానీయాలు ;

సోపు టీ : సోపు గింజలు జీర్ణక్రియ ,జీవక్రియను పెంచడంలో బాగా సహాయపడుతాయి. బరువు తగ్గాలన్న ప్రయత్నాలల్లో ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకోవచ్చు.

READ ALSO : Weight Loss : బరువు తగ్గడంలో భాగంగా అనుసరించాల్సిన ముఖ్యమైన చిట్కాలు !

వాము ఆకుల నీరు: కడుపు సంబంధిత సమస్యలకు వాము ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే వాము ఆకులతో తయారు చేసుకున్న నీటిని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాము ఆకులు అనేక సమస్యలకు చికిత్స చేయడానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ ; బరువు తగ్గడానికి గ్రీన్ టీ బాగా ఉపకరిస్తుంది. బరువు తగ్గడానికి చాలా మంది దీనిని తీసుకుంటుంటారు. ఇందులో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది జీవక్రియను పెంచుతుంది.

READ ALSO : Lemon Water : ప్రతి రోజు నిమ్మకాయ నీరు తాగుతున్నారా?… అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే !

బ్లాక్ టీ ; బ్లాక్ టీలో బరువు తగ్గడంలో సహాయపడే సమ్మేళనాలు ఉన్నాయి. ఇందులో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం, లెమన్ వాటర్ : బరువు తగ్గడానికి అల్లం లెమన్ వాటర్ ని తీసుకోవచ్చు.వచ్చు. బరువు తగ్గడమే కాకుండా, జీర్ణశయాంతర ప్రేగు సమస్యలకు ఈ పానీయం చాలా ఉపకరిస్తుంది. ఇది వాపు, తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది.

READ ALSO : Eating Fruits : బరువు ఎక్కువ ఉన్నవాళ్లు పండ్లు తినొచ్చా…?

కూరగాయల రసాలు ; వివిధ కూరగాయల రసాలు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపకరిస్తాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఆహారంలో తక్కువ కేలరీల కూరగాయల రసాన్ని తీసుకోవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

యాపిల్ వెనిగర్: ఆహారం తినే ముందు ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం ద్వారా జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది, ఇది అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.