Emergency Contacts : ఈ ఎమర్జెన్సీ నంబర్లను వెంటనే సేవ్ చేసుకోండి

అత్యవసర పరిస్థితులు ఏర్పడినపుడు.. మనకు సాయం అందించడానికి ఎవరూ అందుబాటులో లేనపుడు ఖచ్చితంగా కొన్ని టోల్ ఫ్రీ నంబర్లను మొబైల్‌లో సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. వెంటనే వాటిని సేవ్ చేసుకోండి.

Emergency Contacts : ఈ ఎమర్జెన్సీ నంబర్లను వెంటనే సేవ్ చేసుకోండి

Emergency Contacts

Updated On : September 23, 2023 / 4:00 PM IST

Emergency Contacts : బయటకు వెళ్లినపుడు ఏదైనా ఆపద రావచ్చు.. ఇతరుల సాయం అవసరం అవ్వచ్చు. ఆ సమయంలో స్పందించడానికి ఎవరూ దగ్గర్లో ఉండకపోవచ్చు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన కొన్ని టోల్ ఫ్రీ నంబర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

Election Commission of India : ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు: సుప్రీంకోర్టుకు ఈసీ వెల్లడి

భారీ అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. తాత్కాలికంగా అందరూ మంటలు ఆపే ప్రయత్నాలు చేసినా వెంటనే 101 నంబర్‌కి సమాచారం ఇస్తే సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ప్రాణాపాయం నుంచి రక్షిస్తారు.

రోడ్డుపై మహిళల్ని కొందరు ఆకతాయిలు వేధిస్తుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. కొన్ని నేర సంఘటనలను చూస్తుంటాం. అలాంటి సమయంలో పోలీసులు వెంటనే అందుబాటులోకి వచ్చేందుకు 100 నంబర్‌కి డయల్ చేసి వారికి సమాచారం ఇవ్వాలి.

Unlucky Number : 13 నంబర్ అంటే ఎందుకంత భయం? నిజంగానే అన్ లక్కీ నంబరా

రోడ్లపై ప్రమాదాలు చూస్తుంటాం. చాలామంది ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని గమనిస్తాం. ఆ సమయంలో వెంటనే 108 నంబర్‌కి డయల్ చేస్తే వైద్యసాయం అందించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ అంబులెన్స్ కావాల్సిన సందర్భాల్లో 102 నంబర్‌కి డయల్ చేస్తే అంబులెన్స్ సేవలు అందిస్తారు.

మహిళలు బయటకు వచ్చిన సందర్భాల్లో ఒక్కోసారి ఆపదలు ఎదురౌతాయి. అత్యవసర సమయాల్లో 1091 నంబర్‌కి కాల్ చేస్తే సాయం అందుతుంది. ఒక్కోసారి మనకు కావాల్సిన సాయం గురించి ఎవరిని సంప్రదించాలో తెలియదు. అలాంటి సందర్భాల్లో 1110 నంబర్‌కి డయల్ చేస్తే సమాచారం ఇస్తారు.

Ambulance 108 : అంబులెన్స్‌కు 108 నంబర్ పెట్టటం వెనుక ఇంత అర్థం, చరిత్ర ఉందా..?

పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో పేరెంట్స్ తీవ్ర ఆందోళన చెందుతారు. అలాంటి సందర్భాల్లో 1094 నంబర్‌కి కాల్ చేస్తే డిప్యూటీ పోలీసు కమిషనర్ ఈ విషయంపై సాయం చేస్తారు. తుపాన్లు, వరదలు చిక్కుకున్న వారు సాయం కోసం 1078 నంబర్‌కి డయల్ చేయాలి. అధికారులు తక్షణం స్పందించి సాయం అందిస్తారు.

ఎక్కడికైనా విహారయాత్రకి వెళ్లిన సందర్భంలో అక్కడ ఏదైనా సమస్య ఎదురైనపుడు 363 నంబర్‌కి ఫోన్ చేస్తే సాయం అందుతుంది. ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మందులు, ఇతర సాయం కోసం 1097 నంబర్‌కి కాల్ చేయాలి. ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. సైబర్ క్రైం జరిగినపుడు 155620 నంబర్‌కి ఫోన్ చేయాలి. సడెన్‌గా ఇంట్లో గ్యాస్ లీకైనట్లు అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఆలస్యం చేయకుండా 1906 నంబర్‌కి ఫోన్ చేస్తే టెక్నికల్ సిబ్బంది వెంటనే సమస్యను సాల్వ్ చేస్తారు.