Overweight : అధికబరువు సమస్య నుండి బయటపడాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయ్!

నిజానికి ఆరోగ్యం బాగుండాలి అంటే నిద్ర చాలా అవసరం. సాధారణ మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. సరైన నిద్ర లేక పోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బ తింటుంది. నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి.

Overweight : అధికబరువు సమస్య నుండి బయటపడాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయ్!

Overweight :

Updated On : January 1, 2023 / 1:27 PM IST

Overweight : అధిక బరువు సమస్య ఉన్న వాళ్లు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కలుగుతుంది. బరువు తగ్గాలంటే తక్కువ తినాలి, ఎక్కువ వ్యాయామం చేయాలి అనుకుంటాం. కానీ కొన్ని జీవనశైలి మార్పులను కూడా అనుసరించినప్పుడే మెరుగైన ఫలితం దక్కుతుంది. సరిగా డైట్ తీసుకోవటంతోపాటుగా, వ్యాయామం చేయడం వల్ల కొవ్వును కరిగించుకోవచ్చు.

అధిక బరువుతో బాధ పడే వాళ్ళు పూర్తిగా ఆహారాన్ని తినడం మానేయటం మంచిదికాదు. ఆహారాన్ని మానేస్తే లేని పోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. కార్బోహైడ్రేట్స్‌ని మీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. అయితే మీరు బరువు పెరిగిపోతున్నారు అని అనవసరంగా కార్బోహైడ్రేట్స్‌ని డైట్ నుంచి తొలగించకుండా రోజు మొత్తంలో తీసుకునే ప్రొటీన్‌ పరిమాణాన్ని రెట్టింపు చేయాలి. ప్రొటీన్‌తో ఆకలి తగ్గి, ఎక్కువ సమయం పాటు హుషారుగా ఉంటాం. నిద్రలేమితో త్వరగా బరువు పెరిగిపోతాం. కాబట్టి కంటి నిండా నిద్రపోవాలి.

నిజానికి ఆరోగ్యం బాగుండాలి అంటే నిద్ర చాలా అవసరం. సాధారణ మనిషి రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. సరైన నిద్ర లేక పోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బ తింటుంది. నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఇలా తినడం వల్ల ఎక్కువ సమయం పాటు పొట్ట నిండుగా ఉండి, చిరుతిళ్ల మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది. శీతల పానీయాలతో ఊబకాయం వస్తుంది. వీటికి బదులు పండ్ల ముక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను తాగడం మేలు.

రాత్రి భోజనం తర్వాత, స్నేహితులతో కలిసి ఆరుబయట సరదాగా పరుగులు పెట్టండి. లేదా ఆటలు ఆడండి. ఈ పనులన్నీ అధిక బరువును తగ్గిస్తాయి. డాన్స్‌ క్లాస్‌లో చేరితే, కార్డియో ఫలితం దక్కి, అధిక బరువు కోల్పోతాం. మనసు కూడా హుషారుగా మారుతుంది. ఎక్కడికైనా వెళితే లిఫ్ట్‌కి బదులు మెట్లను ఎక్కండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే బదులు సూపర్ మార్కెట్‌కి నడిచి వెళ్లి వాటిని తీసుకోవటం వంటివి చేయాలి.

అలాగే వెల్లుల్లి తీసుకుంటే బరువుని కంట్రోల్ చేసుకోచ్చు. దీని కోసం మీరు రోజు కి ఒకటి లేదా రెండు రెమ్మల వెల్లుల్లిని తీసుకుని తర్వాత ఒక గ్లాసు నిమ్మ రసం తీసుకోండి. ప్రతి రోజు ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కింద మీరు ఓట్స్‌ను తీసుకుంటే ఎనర్జీ లభిస్తుంది. అలానే బరువు కూడా తగ్గవచ్చు. ప్యాకేజేడ్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్ వలన కూడా ఫ్యాట్ చేరుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. పరగడుపున నిమ్మ రసంలో తేనె వేసుకుని తీసుకుంటే అధిక బరువు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.