Friendship : ఫ్రెండ్స్ అయినా సరే.. అంగీకరించకూడని అంశాలు తెలుసుకోండి

బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని వాళ్లేమన్నా భరించడం.. సహించడం సరికాదు. ఇష్టం లేని అంశాల్ని గట్టిగా చెప్పగలగాలి. ఫ్రెండ్స్ అయినంత మాత్రాన అన్ని విషయాలు అంగీకరించాల్సిన అవసరం లేదు.

Friendship : ఫ్రెండ్స్ అయినా సరే.. అంగీకరించకూడని అంశాలు తెలుసుకోండి

Friendship

Friendship Tips : అన్ని బంధాలలోకి గొప్పదైన బంధం స్నేహ బంధం. కుటుంబ సభ్యులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వారి ప్రతి అభిప్రాయాన్ని ఏకీభవించడం, బాధ కలిగించే అంశాలున్నా సర్దుకుపోవడం సరి కాదు. స్నేహితులైనంత మాత్రాన అంగీకరించకూడని అంశాలు ఏంటి? చదవండి.

Boss memo to Employees : ‘పని వేళల్లో స్నేహంగా, సరదాగా ఉండకూడదు’.. ఓ కంపెనీ ఉద్యోగులకు బాస్ పంపిన మెమో వైరల్

ఏ బంధంలో అయినా ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా అవసరం. ఇతరుల ముందు స్నేహితులను చులకనగా మాట్లాడటం, అగౌరపరచడం స్నేహం అనిపించుకోదు. అలాంటి సందర్భాలు ఎదురైనపుడు అలా చేయవద్దని ఖచ్చితంగా వారికి చెప్పాలి. నమ్మకం అనే పునాదితో స్నేహం ఏర్పడుతుంది. స్నేహితుడిని నమ్మి అనేక విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. నమ్మకాన్ని బ్రేక్ చేస్తూ స్నేహితుల ప్రవర్తన ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బంధం నుంచి బయటకు వచ్చేయాలి.

కొంతమంది స్నేహితులపై జోకులు వేస్తుంటారు. వారి వ్యక్తిగత విషయాల గురించి అందరిలో మాట్లాడి కామెడీ చేయాలని ప్రయత్నిస్తారు. అలా ఎగతాళి చేసినా, అవమానించినా భరించనవసరం లేదు.  ఖచ్చితంగా మాట్లాడాలి. స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోయినా గౌరవించుకోవాలి. అలాగని నా అభిప్రాయమే సరైనదని.. స్నేహితుల అభిప్రాయాలను తీసిపారేయడం పద్ధతి కాదు. కొందరు స్నేహితుల అభిప్రాయాలకు విలువ ఇవ్వరు.

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అప్‌డేట్.. మీ పోస్టులు క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే కనిపించేలా చేయొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

స్నేహితులు ఒకరినొకరు పట్టించుకోవాలి. ఒకరిపై ఒకరికి శ్రద్ధ ఉండాలి. ఏ బంధమైన వన్ సైడ్ ఉంటే ఎక్కువకాలం నిలవదు. అలాంటి సందర్భం వస్తే ఖచ్చితంగా ఆ స్నేహ బంధం నుండి బయటకు వచ్చే టైమ్ అయ్యిందని అర్ధం. తమ మధ్య వచ్చిన విభేదాలకు కారణాలు అన్వేషిస్తూ ఏం జరుగుతోందో ఖచ్చితంగా స్నేహితులు మాట్లాడుకోవాలి. సరిచేసుకోనే ప్రయత్నం చేయాలి. లేదంటే నమ్మకం, గౌరవం లేని చోట స్నేహం బీటలు వారుతుంది.