COVID-19: డయాబెటీస్, బీపీ ఉన్నవారికే కాదు.. వీరికి కూడా కరోనా ప్రమాదం ఎక్కువే!
ఊబకాయం ఎప్పుడూ ప్రమాదమే. శరీరంలో మార్పులకు, రోగాలకు కారణమయ్యే ఊబకాయం వల్ల COVID-19 ప్రమాదం చాలా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Obesity
Common Health Problem: ఊబకాయం ఎప్పుడూ ప్రమాదమే. శరీరంలో మార్పులకు, రోగాలకు కారణమయ్యే ఊబకాయం వల్ల COVID-19 ప్రమాదం చాలా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఊబకాయులకు ఒక్కసారి కరోనా వస్తే తగ్గినప్పటికీ, శరీరంలో వైద్య సమస్యలతో ధీర్ఘకాలం పోరాడవల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నుంచి వచ్చిన కొత్త అధ్యయనంలో, స్థూలకాయంతో బాధపడేవారికి దీర్ఘకాలిక COVID-19 సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.
మితమైన లేదా తీవ్రమైన ఊబకాయం ఉన్న రోగులకు కరోనా వస్తే, దీర్ఘకాలిక పరిణామాలను అభివృద్ధి చేసే ప్రమాదం 30% ఎక్కువగా ఉందని వారు కనుగొన్నారు.
అధ్యయనంలో, బృందం కరోనా నుంచి కోలుకున్నవారిని పర్యవేక్షించి, వారి డేటాను తీసుకుని అధ్యయనం ప్రిపేర్ చేసింది. ఊబకాయం ఉన్నవారిలో COVID-19 వస్తే, దీర్ఘకాలిక సమస్యలు చాలా సాధారణంగా వచ్చాయని, వ్యాధి నుండి బయటపడిన వ్యక్తులలో 40% మందికి దీర్ఘకాలిక సమస్యలు వచ్చినట్లు అధ్యయనం చెబుతోంది.
మోస్తరు నుంచి తీవ్రమైన స్థూలకాయం ఉన్న వ్యక్తులకు కరోనా వస్తే, కచ్చితంగా ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పటివరకు డయాబెటిస్, బీపీ ఉన్నవారికే కరోనా వస్తే ప్రమాదం ఎక్కువ అని నిపుణులు ప్రకటించగా.. అవి లేకపోయినా కూడా ఊబకాయం ఉన్నవారికి ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడిందని అధ్యయనం చెబుతోంది.
వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించడానికి ఊబకాయం ఉన్న రోగులను రక్షించడంలో వ్యాక్సిన్‍లు అత్యంత ప్రభావవంతంగా పనిచేసినట్లుగా కూడా వెల్లడించారు నిపుణులు.