Potato Chips : ఆలూ చిప్స్ తో ఆరోగ్యానికి ముప్పే?
ఈ చిప్స్ ని ఎక్కువమెతాదేలో తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. వంధ్యత్వానికి దారి తీస్తుంది. బరువు పెరుగుతారు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి లోనుకావాల్సి వస్తుంది.

Potato Chips
Potato Chips : కరకరలాడుతూ రుచిగా ఉండే ఆలూ చిప్స్‌ను లొట్టలేసుకుంటూ మరీ తింటుంటారు. అయితే ఆలూ చిప్స్ రుచిగా ఉండటంతో చాలా మంది అతిగా లాగించేస్తుంటారు. వీటిని ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల శరీరానికి హానికలుగుతుందని నిపుణులు తెలిజేస్తున్నారు. ఆలూ చిప్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిగిపోతుంది.ఇక చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.గుండె పొటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి.
ఆలూ చిప్స్ నూనెలో వేయించి ఉప్పు తో తయారు చేస్తారు. ఈ చిప్స్ ను ఎక్కువగా తింటే రక్తపోటు పెంచడమే కాకుండా రక్తహీనత సమస్యను కలిగిస్తాయి. బంగాళాదుంప చిప్స్ ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చిప్స్ రక్తపోటు సమస్యను పెంచడమే కాకుండా దీనివల్ల మెదడు పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. గుండె జబ్బులు వచ్చే సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్ చేయబడిన చిప్స్ లో అధికంగా ఉప్పు ఉంటుంది. ఇది శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. చిప్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్… చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగా సాగదు. దీని వల్ల గుండె పోటు ప్రమాదాలు పెరుగుతాయి.
ఈ చిప్స్ ని ఎక్కువమెతాదేలో తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. వంధ్యత్వానికి దారి తీస్తుంది. బరువు పెరుగుతారు. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల మానసిక ఒత్తిడికి లోనుకావాల్సి వస్తుంది. ఆలూ చిప్స్‌లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. చిప్స్ తీసుకోవటం వల్ల శరీరానికి మేలు జరగకపోగా, కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రోగ నిరోధక శక్తి బలహీన పడి వైరస్‌లు, బ్యాక్టీరియాలు త్వరగా ఎటాక్ అవుతాయి. కాబట్టి ఆలూ చిప్స్ తీసుకోవటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని గుర్తించాలి.