మీ TikTokలో Bug ఉంది జాగ్రత్త : అకౌంట్.. హ్యాకర్ల చేతుల్లోకి?

  • Published By: sreehari ,Published On : January 9, 2020 / 11:18 AM IST
మీ TikTokలో Bug ఉంది జాగ్రత్త : అకౌంట్.. హ్యాకర్ల చేతుల్లోకి?

Updated On : January 9, 2020 / 11:18 AM IST

టిక్ టాక్.. పరిచయం అక్కర్లేని యాప్. సోషల్ మీడియాలో దీనికి ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు.. ఈజీగా అకౌంట్ క్రియేట్ చేసుకుని నచ్చిన వీడియోలు పోస్టు చేసుకోవచ్చు. దీంతో ప్రతిఒక్కరూ టిక్ టాక్ చేయడం ట్రెండీగా మారిపోయింది. ఫేస్ బుక్ అకౌంట్ లేకున్నా టిక్ టాక్ అకౌంట్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ వీడియోలను రికార్డు చేస్తూ టిక్ టాక్ చేసేస్తున్నారు.

మల్టీపుల్ సెక్యూరిటీ బగ్స్ ఇదిగో :
ఎంతో పాపులర్ అయిన ఈ టిక్ టాక్ లో యూజర్ల డేటాకు ముప్పు ఉందంటూ గత ఏడాదిగా రుమార్లు వస్తూనే ఉన్నాయి. యూజర్ల డేటా లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని రీసెర్చర్లు కూడా ఎన్నోసార్లు హెచ్చరించారు. అయితే, ఈ యాప్ లో మల్టీపుల్ సెక్యూరిటీ బగ్స్ ఉన్నట్టుగా రీసెర్చర్లు గుర్తించారు. వీటి కారణంగా.. ఎక్కువ సెకన్ల నిడివి గల వీడియోలను అనుమతిస్తున్నాయని అంటున్నారు.

ఈ సెక్యూరిటీ బగ్స్ కారణంగా మిలియన్ల మంది టిక్ టాక్ యూజర్ల అకౌంట్లకు ముప్పు ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హ్యాకర్లు సులభంగా టిక్ టాక్ యూజర్ల డేటాను తస్కరించడంతో పాటు వారి అకౌంట్లను తమ కంట్రోల్లోకి తీసుకోగలరని హెచ్చరిస్తున్నారు. ఒక్క ఇండియాలోనే అత్యధిక మంది టిక్ టాక్ యూజర్లు ఉండగా, ఈ బగ్స్ కారణంగా 300 మిలియనక్లకు పైగా యూజర్ల డేటా రిస్క్‌లో పడేయనున్నట్టు రీసెర్చర్లు చెబుతున్నారు.

టిక్ టాక్ అప్లికేషన్ లో బహుళ సంఖ్యలో భద్రతా లోపాలు ఉన్నాయని చెక్ పాయింట్ రీసెర్చ్ బృందాలు గుర్తించినట్టు ఇటీవల రీసెర్చర్లు వెల్లడించారు. ఈ విషయాన్ని టిక్ టాక్ డెవలపర్స్ కూడా తెలియజేసినట్టు రీసెర్చ్ టీం తెలిపింది. టిక్ టాక్ యాప్ సురక్షితంగా వినియోగించుకునేలా యూజర్ల భద్రత కోసం చర్యలు చేపట్టాల్సిందిగా బైట్ డాన్స్ కంపెనీకి సూచించారు.

ఇలాంటి లింకులు Click చేయొద్దు :
ఈ బగ్స్ కారణంగా టిక్ టాక్ యూజర్ల డేటా బహిర్గతమై హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని చెక్ పాయింట్ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. TikTok తరపున ఏదైనా ఫోన్ నెంబర్ నుంచి హ్యాకర్లు SMS మెసేజ్ పంపే అవకాశం కూడా ఉందని తమ రీసెర్చ్ లో గుర్తించినట్టు చెప్పారు. www.tiktok.com వెబ్ సైట్ నుంచి TikTok యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలంటూ యూజర్లకు SMS పంపే అవకాశం కూడా ఉందని చెక్ పాయింట్ తెలిపింది.

దీనిద్వారా హ్యాకర్లు ఈజీగా యూజర్ల అకౌంట్లలోకి మాలాసియస్ లింకులను పంపే ప్రమాదం ఉంది. ఆ లింకులను ఒకసారి యూజర్ క్లిక్ చేస్తే టిక్ టాక్ అకౌంట్ మొత్తం హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిపోతుందని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు. ఎంతమంది టిక్ టాక్ యూజర్లకు ఈ రిస్క్ ఉందనే విషయంలో స్పష్టత లేదు. కానీ, మిలియన్ల మంది టిక్ టాక్ యూజర్ల అకౌంట్లు రిస్క్ లో ఉన్నాయని పరిశోధక బృందం గట్టిగా చెబుతోంది.

బగ్స్ కారణంగా తలెత్తే చిక్కులు :
* TikTok అకౌంట్లను హ్యాకర్లు తమ కంట్రోల్లోకి తీసుకునే అవకాశం ఉంది.
* మీ డేటాను తస్కరించవచ్చు, వీడియోలన్నింటిని డిలీట్ చేయొచ్చు.
* అశ్లీల వీడియోలను మీ అకౌంట్లో Upload చేయొచ్చు.
* మీ అకౌంట్లో ప్రైవేట్ వీడియోలను తిరిగి Public మోడ్ లోకి మార్చేయొచ్చు.
* మీ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయొచ్చు.
* మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్ సహా ఇతర వివరాలను misuse చేసే అవకాశం ఉంది.

TikTok యూజర్లకు రిస్క్ ఉందా?
అంటే.. అవుననే చెప్పాలి. మీ టిక్ టాక్ అకౌంట్ రిస్క్ ఉందని అనుమానం ఉంటే వెంటనే లాగౌట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. చెక్ పాయింట్ ప్రకారం.. టిక్ టాక్ యాప్ లోని సెక్యూరిటీ బగ్స్ ఫిక్స్ చేశారట టిక్ టాక్ డెవలపర్స్. టిక్ టాక్ యూజర్లు తప్పనిసరిగా తమ యాప్ Update చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వాడే డివైజ్ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ఏదైనా వెంటనే TikTok Update చేసుకోండి.