Sleep : అలసట లేకుండా నిద్ర మేల్కోవటానికి చిట్కాలు
నింద్రించే గది వాతావరణం ప్రశాతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే బెడ్ తోపాటు, ఫర్నిచర్ వంటివన్నీ నిద్రపై ప్రభావం చూపిస్తాయి. వీటిని నిద్రకు అనువైన విధంగా మార్చుకోవటం మంచిది.

Happiness
Sleep : మనిషి దైనందిన జీవితంలో నిద్ర అనేది ఒక భాగం…ప్రతి వ్యక్తి రాత్రి సమయాన్ని నిద్రకు కేటాయిస్తారు. ప్రతిరోజు రాత్రి ఏడుగంటల నుండి ఎనిమిది గంటల సమయం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని నిపుణులు సైతం సూచిస్తున్నారు. శరీరం విశ్రాంతి లేకుండా పనిచేసిన సందర్భంలో, మానసిక శ్రమ ఎక్కువైనప్పుడు ఉదయం నిద్రమేల్కోనే సమయంలో అలసట అనే భావన కలుగుతుంది.
గాఢమైన, ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించాలనుకుంటే నిద్రకు మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవటం మంచిది. దీనివల్ల నిద్ర త్వరగా రావటానికి అవకాశం ఉంటుంది. నిరంతరం నిద్రకు భంగం కలిగించే పరిస్ధితులు వల్ల మనం తీసుకునే విశ్రాంతికి ఇబ్బందికరమౌతుంది. ఉదయం కాఫీ, రెడ్ వైన్, మిల్క్ చాక్లెట్ వంటివి అలసట అనుభూతిని కలిగిస్తాయి. కాబట్టి నిద్రవేళకు ముందు వీలైనంత వరకు అలాంటి వస్తువులకు దూరంగా ఉండటం మంచిది.
చాలా మంది నిద్రకు ఉపక్రమించబోయే ముందు టాయిలెట్ కి వెళ్ళటం అలవాటుగా ఉంటుంది. అయితే మరికొంతమంది మాత్రం నిద్రలోకి జారుకునే ముందు చదవడం, టెలివిజన్ చూడటం, ఆటలు ఆడటం వంటి వాటితో సమయాన్ని వెచ్చిస్తారు. ఈ సమయంలో మన మూత్రాశయాలు మూత్రంతో నిండుకుంటాయి. దీంతో కిడ్నీలు రాత్రంతా మనం నిద్రపోతున్నప్పుడు పని చేస్తూనే ఉంటాయి. దీనికారణంగా ఉదయం మేల్కొన్నప్పుడు మూత్రాశయం నిండి ఉండటమే కాకుండా తెల్లవారు జాము సమయంలో మెలుకువ వస్తుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఉదయం నిద్రమేల్కోనే సమయంలో అలసటగా ఉంటుంది.
నింద్రించే గది వాతావరణం ప్రశాతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే బెడ్ తోపాటు, ఫర్నిచర్ వంటివన్నీ నిద్రపై ప్రభావం చూపిస్తాయి. వీటిని నిద్రకు అనువైన విధంగా మార్చుకోవటం మంచిది. దీని వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరటమే కాకుండా హాయిగా నిద్రపడుతుంది. ఉదయం ఎలాంటి అలసట లేకుండా ఉల్లాసంగా నిద్రమేల్కొనేందుకు అవకాశం ఉంటుంది. నిద్రసమయంలో ఉద్భవించే ఆలోచనా విధనాల వల్ల శరీరంలో కార్టిసాల్ స్ధాయి పెరుగుదలకు కారణమౌతాయి. దీని వల్ల రాత్రి నిద్రపోయిన తరువాత అలసటగా, నీరసంగా అనిపించేందుకు దారితీస్తుంది. ప్రతిరోజు నిద్ర పోయేందుకు ముందుగానే ఒక సమయాన్ని నిర్ధేశించుకోవాలి. ఇలా చేయటం వల్ల కంటి నిండా నిద్రపోవటానికి అవకాశం ఉంటుంది.
ఉరుకుల పరుగులు జీవితంలో హాయిగా నిద్రపోవడం అనేది గొప్ప వరంగా చెప్పవచ్చు. నిద్రకు ముందు ఆనందగా ఉన్న క్షణాలను గుర్తుకు తెచ్చుకోవటం మంచిది. దీని వల్ల ప్రశాంతత కలిగి త్వరగా నిద్రపట్టేందుకు ఆందోళన తగ్గేందుకు సహాయపడుతుంది. వివిధ రకాల సమస్యల గురించి నిద్రకు ముందు పదేపదే ఆలోచించటం ఏమాత్రం మంచిది కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. టెన్షన్ కారణంగా నిద్రకరువై ఉదయం నిద్రలేచే సమయంలో అలసట అనిపిస్తుంది.