Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

వాయుకాలుష్యం కారణంగా బహిరంగ ప్రదేశాలలో గాలి నాణ్యత రోజురోజుకు మారుతుంది. కొన్నిసార్లు ఈ గాలిని పీల్చుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. బహిరంగ వాయు కాలుష్యం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

lungs healthy

Updated On : October 14, 2023 / 12:58 PM IST

Protecting Your Lungs : కొన్నిసార్లు మనం మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తేలికగా తీసుకుంటాము. మనల్ని ఎక్కువకాలం జీవించేలా చేయటంలో ఊపిరితిత్తులు ఎంతగానో సహాయపడతాయి. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. మనిషి శరీరం ఊపిరితిత్తులను రక్షించడానికి సహజ రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. దుమ్ము, ధూళి , సూక్ష్మక్రిముల నుండి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడే మార్గాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

READ ALSO : Somireddy ChandraMohan Reddy : శిశుపాలుడివి వంద తప్పులు,జగన్‌వి వెయ్యి తప్పులు .. దేవుడున్నాడు జాగ్రత్త : సోమిరెడ్డి

ఉపిరితిత్తుల ఆరోగ్యానికి అనుసరించాల్సిన మార్గాలు ;

పొగతాగటం నిలిపివేయటం ; ఊపిరితిత్తుల క్యాన్సర్ , క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)కి ధూమపానం ప్రధాన కారణం. ఇందులో క్రానిక్ బ్రోన్కైటిస్, ఎంఫిసెమా ఉన్నాయి. సిగరెట్ పొగ గాలి మార్గాలను చిన్నవిగా చేస్తుంది. శ్వాస తీసుకోవటం కష్టతరం చేస్తుంది. దీర్ఘకాలంలో అనేక ఇబ్బందులకు కారణమవుతుంది. ఊపిరితిత్తులలో వాపు, ఇది క్రానిక్ బ్రోన్కైటిస్‌కు దారితీస్తుంది. కాలక్రమేణా సిగరెట్ పొగ ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తుంది. క్యాన్సర్‌గా మారే అవకాశాలను ప్రేరేపిస్తుంది.

ఇంటిలోపలి గాలి నాణ్యత ; ఇంటి లోపల ఉండే సమయంలో గాలిలో నాణ్యత ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యం. మనం పనిచేసే ప్రదేశం, నివసించే, ఆడుకునే భవనాలు ,నిర్మాణాలలో గాలి ప్రసరించేలా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సమయం ఇంటి లోపలే గడిపే వారికి ఇది చాలా కీలకమైనది. బయట గాలి కంటే ఇంటిలోపలి గాలి మరింత కలుషితం అవుతుందని గుర్తించుకోవాలి. సిగరెట్ పొగ వంటి వాటి వల్ల ఇల్లు , కార్యాలయంలోని రసాయనాలు ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతాయి.

READ ALSO : Muscle Building : కండరాల నిర్మాణంలో సహాయపడే గుడ్లు !

వాయు కాలుష్యం ; వాయుకాలుష్యం కారణంగా బహిరంగ ప్రదేశాలలో గాలి నాణ్యత రోజురోజుకు మారుతుంది. కొన్నిసార్లు ఈ గాలిని పీల్చుకోవడం అనారోగ్యానికి దారితీస్తుంది. బహిరంగ వాయు కాలుష్యం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాతావరణ మార్పు మరియు ప్రకృతి వైపరీత్యాలు కూడా నేరుగా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. బహిరంగ కాలుష్యం నుండి మీ ఊపిరితిత్తులను రక్షించుకోవటానికి చల్లటి గాలి వీస్తున్న సమయంలో ఆరుబయట వ్యాయామం చేయడం మానుకోవాలి. వాహనాలు, పబ్లిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వ్యాయామం చేయడం మానుకోవాలి. కలప , చెత్తను కాల్చే ప్రదేశాలలో ఎక్కువ సమయం ఉండకపోవటం మంచిది.

రెగ్యులర్ చెక్-అప్‌లు ; రెగ్యులర్ చెక్-అప్‌లు వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. ఊపిరితిత్తుల వ్యాధికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. కొన్నిసార్లు వ్యాధి తీవ్రతరమయ్యేంత వరకు గుర్తించటం సాధ్యపడదు. అడపాదడపా చెక్-అప్ ల వల్ల సమస్యలను తెలుసుకోవచ్చు. సమస్య ప్రారంభదశలో ఉన్నప్పుడు చికిత్స అందించటం ద్వారా త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది.

READ ALSO : Purandeswari : చంద్రబాబుతో పురంధేశ్వరి ములాఖత్ .. ఆసక్తికరంగా మారిన ఏపీ రాజకీయాలు

పోషకాలతో కూడిన ఆహారం ; యాంటీఆక్సిడెంట్లు,విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఊపిరితిత్తులలో వాపు రాకుండా నివారిస్తాయి. రోజువారీ డైట్ లో తాజా పండ్లు,పచ్చి కూరగాయలు, ఆకు కూరలు తప్పకుండా ఉండేలా చూసుకోవటం మంచిది.

రోజువారి వ్యాయామాలు ; చిన్న వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారి వ్యాయామాలు తప్పనిసరి చేసుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. వ్యాయామం ఊపిరితిత్తులను బలోపేతం చేయటంలో సహాయపడుతుంది.