Somireddy ChandraMohan Reddy : శిశుపాలుడివి వంద తప్పులు,జగన్‌వి వెయ్యి తప్పులు .. దేవుడున్నాడు జాగ్రత్త : సోమిరెడ్డి

శుపాలుడు చేసినవి వంద తప్పులైతే జగన్ చేసినవి వెయ్యి తప్పులు చేశారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Somireddy ChandraMohan Reddy : శిశుపాలుడివి వంద తప్పులు,జగన్‌వి వెయ్యి తప్పులు .. దేవుడున్నాడు జాగ్రత్త : సోమిరెడ్డి

Somireddy Chandra Mohan Reddy Fire on CM Jagan

Updated On : October 14, 2023 / 12:30 PM IST

Somireddy ChandraMohan Reddy : శిశుపాలుడు చేసినవి వంద తప్పులైతే జగన్ చేసినవి వెయ్యి తప్పులు చేశారు అంటూ మండిపడ్డారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయటంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి మండిపడ్డారు. సజ్జల వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు.

73 ఏళ్ల చంద్రబాబును జైల్లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. భగవంతుడు ఉన్నాడు..అన్నీ చూస్తున్నాడు దుర్మార్గులకు శిక్ష విధిస్తాడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు ఆందోళనపడుతుంటే మీరు చేసిన వ్యాఖ్యలు నీచమైనవి అంటు దుయ్యబట్టారు.

Sajjala Ramakrishna Reddy : జైలులో చంద్రబాబుకు ఏసీ పెట్టటానికి అదేమన్నా అత్తారిల్లా..? : సజ్జల సెటైర్లు

ఈ సందర్భంగా సోమిరెడ్డి కడప ఫ్యాక్షన్ చరిత్ర గురించి మాట్లాడారు. ఫ్యాక్షన్ గొడవల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. ఎన్నో కుటుంబాలు బలైపోయాయని అన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కుటుంబాల వల్ల ఎంతోమంది అనాధలైపోయారని అటువంటి చరిత్ర మా నాయకుడికి గానీ..మా పార్టీకి గానీ లేదన్నారు.వంద తప్పులు చేసిన శిశుపాలుడ్ని శ్రీకృష్ణుడు సంహరించాడని 1000 తప్పులు చేసినవారిని వదిలిపెట్టడని పైన దేవుడున్నాడు అన్నీ చూస్తున్నాడు జాగ్రత్త అంటూ హెచ్చరించారు.