Wooden comb : జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ చెక్కతో చేసిన దువ్వెన వెరీ బెస్ట్
జుట్టు రాలే సమస్య ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలే సమస్యకు కారాణాలు ఎన్నో ఉన్నా.. ప్రతీరోజు మనం తల దువ్వుకునే దువ్వెన కూడా జుట్టు రాటానికి కారణమని తెలుసా..?

neem wooden comb
Best Wooden comb : పెరుగుతున్న గాలి కాలుష్యం.. తీసుకునే ఆహారాలు, మానసిక ఒత్తిడి వంటి పలు కారణాలు జుట్టు రాలటానికి కారణాలుగా మారుతున్నాయి. ప్రతీ ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య ఉంది. జుట్టు రాలిపోతోంది..ఏం చేయాలో తెలియట్లేదు అంటూ వాపోతున్నారు. దీని కోసం నిపుణులను సంప్రదిస్తుంటారు. కానీ జుట్టు రాలటానికి కారణాలు ఎన్ని ఉన్నా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్య నివారించవచ్చని నిపుణులు సూచిస్తుంటారు.
సరైన ప్రొటీన్స్ తీసుకోవాలని..ఐరన్, కాల్షియం వంటి ఆహారాలు తీసుకోవాలని చెబుతుంటారు. కానీ ప్రతీరోజు మనం తల దువ్వుకునే దువ్వెన కూడా జుట్టు రాటానికి కారణం అని చాలామంది గుర్తించరు. రోజుకు రెండు సార్లు అయిన దువ్వుకునే ‘దువ్వెన’ జుట్టు రాలటానికి కారణంగా ఉంటోందని అదే దువ్వెన విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాదు జుట్టు చక్కగా ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి ఎటువంటి దువ్వెన వాడాలి..? అనే విషయం తెలుసుకుందాం..
జుట్టు రాలకుండా ఉండాలంటే స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉంటేనే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు సహజ సిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉండాలంటే ప్లాస్టిక్ దువ్వెన కాకుండా ‘చెక్క దువ్వెన’ వాడాలని సూచిస్తున్నారు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చెక్క దువ్వెన వాడాలి. అలా చెక్క దువ్వెన వాడితో స్కాల్ప్ కు చక్కటి మసాజ్ గా పనిచేస్తుంది. రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. మరి ఎటువంటి చెక్క దువ్వెన వాడాలి అంటే ‘వేప చెక్కతో చేసిన దువ్వెన’వాడితే చాలా మంచిదని సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆయుర్వేదంలో వేపకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో తెలిసిందే.
Vitamin K: విటమిన్ కె వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసా ?
వేప దువ్వెనతో తల దువ్వుకుంటే దురద, పేలు వంటి సమస్యలు రానేరావు. ఈ దువ్వెనతో దువ్వుకుంటే స్కాల్ఫ్ కు ఇన్ ఫెక్షన్ రాకుండా చేస్తుంది. ఆక్యుపంక్చర్ పాయింట్స్ ట్రిగ్గర్ అయి స్కాల్ప్‌కి కూడా మసాజ్ చేసినట్లుగా అవుతుంది. తలకు చక్కటి రక్తప్రసరణ జరిగి జుట్టు మృదువుగా ఆరోగ్యంగా మారుతుంది.
ప్లాస్టిక్ దువ్వెన కంటే కూడా చెక్క దువ్వెన మరీ ముఖ్యంగా వేప చెక్కతో చేసిన దువ్వెన ఉపయోగిస్తే ఇన్ఫెక్షన్ రాకుండా నివారించటమేకాదు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. స్కాల్ప్ కు అప్లై చేసుకునే నూనెను సమానంగా స్కాల్ప్ అంతా అంటేలా చేస్తుంది. సాధారణంగా జుట్టు రాలటానికి కారణం జుట్టు బలహీనంగా ఉండి చిక్కు పడిపోవటం. వేప చెక్క దువ్వెనతో దువ్వుకుంటే జుట్టు చిక్కు పడకుండా కూడా ఉంటుంది. పలితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. వీటన్నింటితో పాటు జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.
చెక్క దువ్వెన వాడడం వల్ల స్కాల్ప్‌కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందువల్ల జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి. ప్లాస్టిక్ దువ్వెన కంటే కూడా చెక్క దువ్వెన చాలా రకాలుగా మంచిది. ప్లాస్టిక్ దువ్వెనతో పోలిస్తే చెక్క దువ్వెన జుట్టులో నుంచి స్మూత్‌గా జారిపోతుంది. వేప చెక్క దువ్వెనతో దువ్వుకుంటే చుండ్రు, దురద, పేలు. తలకు అంటిపెట్టుకుని ఉండే మురికిని కూడా వదిలిస్తుంది. ఇలా పలు సమస్యలకు సెక్యురిటీగా ఉంటుంది వేప చెక్కతో తయారు చేసిన దువ్వెన. పైగా ఆయిల్ ద్వారా ఉండే జుట్టును చెక్క దువ్వెన పీల్చుకుంటుంది.
Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చంటే ?
సున్నితమైన స్కాల్ప్ ఉన్నవారికి ప్లాస్టిక్ దువ్వెనల వల్ల ఎలర్జీలు కలుగుతాయి. అటువంటివారు కచ్చితంగా చెక్క దువ్వెన వాడటం మేలు. వేప చెక్క దువ్వెన వాడడం వల్ల జుట్టుకి మంచి బౌన్స్‌ని ఇస్తుంది. రెగ్యులర్ గా చెక్క దువ్వెన వాడడం వల్ల జుట్టు కుదుళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీని వల్ల జుట్టుకి చక్కని ఆరోగ్యకరమైన ఎగిరి పడే జుట్టును సొంతం చేసుకోవచ్చు.