ప్రేమలోపడితే అంతే మరి!

  • Published By: veegamteam ,Published On : February 11, 2019 / 07:00 AM IST
ప్రేమలోపడితే అంతే మరి!

ప్రేమలో నిండా మునిగిన వాళ్లు కళ్లలోకి కళ్లుపెట్టుకుని చూసుకుంటే చాలు, వారి మనసులు కూడా ఒకదాని అధీనంలోకి మరొకటి వచ్చేస్తాయట. ప్రేమలో పడినవాళ్లు 3 నిమిషాల పాటు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకుంటే వారి గుండెలు ఒకేలా కొట్టుకుంటాయని ఓ పరిశోధనలో తేలింది. 

* ప్రేమలో పడితే తిండీ నిద్రా అన్నీమర్చిపోతారు‌. అయినా మనిషిలో ఎంతో ఉత్సాహం. ఆనందం. ప్రేమ ఎక్కించే మత్తు అలాంటిలాంటిది కాదు మరి.

*ఈడూ జోడూ బాగుందా… అని చూసుకోవడం ముమ్మాటికీ కరెక్టే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఒకేస్థాయిలో ఆకర్షణ కలిగిన జంట త్వరగా ప్రేమలో పడతారట మరి.

* అచ్చం ఒకేలా లేదా పూర్తిగా భిన్నంగా ఆలోచించే ప్రేమికుల కన్నా, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తూ మరికొన్నిటిలో విభేదించే ప్రేమికుల బంధమే ఎక్కువకాలం దృఢంగా ఉంటుందట.   

* ప్రేమలో విఫలమైన వాళ్లు ‘గుండె బద్దలైంది’ అంటుంటారు కదా, ఇష్టమైనవారికి దూరం అయినపుడు నిజంగానే గుండెలో గుచ్చినంత బాధ కలుగుతుందట. ఆ సమయంలో మెదడు విడుదలచేసే కొన్ని రసాయనాలు గుండెను బలహీనం చేస్తాయన్నది పరిశోధకుల మాట. దీన్నే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అంటారు. 

* ప్రేమకు కొన్ని లెక్కలున్నాయి. దాన్నే ట్రయాంగిల్‌ థియరి అంటారు. బంధం, దగ్గరితనం, బాధ్యత… ఈ మూడూ ఉంటేనే ఆ ప్రేమ దృఢంగా ఉంటుందట. 

* ప్రేమలో పడిన అమ్మాయిలు అనుక్షణం అతడి సమక్షాన్నే కోరుకుంటారట. అర్ధరాత్రిదాకా మాట్లాడినా, ‘గుడ్‌నైట్‌ స్వీట్‌డ్రీమ్స్‌’ అంటూ ఫోన్‌ పెట్టేసినప్పట్నుంచీ మళ్లీ మర్నాడు వచ్చే ఫోన్‌కాల్‌ కోసం ఎదురు చూస్తారట. అదే అబ్బాయిలైతే… ‘ఇప్పటిదాకా మాట్లాడాంగా, ఇంకేముంటాయి’ అనుకుంటారట.