Viral Video : వధువుని చూసి భావోద్వేగానికి గురైన వరుడు

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అపూరూపమైన ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని జీవిత కాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని కలలు కంటుంటారు.

Viral Video : వధువుని చూసి భావోద్వేగానికి గురైన వరుడు

Instagram Photo

Updated On : August 17, 2021 / 5:47 PM IST

Viral Video : పెళ్లంటే నూరేళ్ళ పంట… అది కోరుకున్న వారి ఇంట పండాలి.. అని పాతాకాలం నాటి తెలుగు సినిమా పాట ఒకటుంది. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అపూరూపమైన ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని జీవిత కాలం గుర్తుంచుకునేలా చేసుకోవాలని కలలు కంటుంటారు. అలాగే వధూవరులిద్దరూ స్పెషల్‌గా కనిపించాలని కోరుకుంటారు. పెళ్లి పీటల మీదకు వచ్చేటప్పుడు వధువు, వరుడికి మరింత అందంగా కనిపించాలని కోరుకుంటుంది.

ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో వధువు అచ్చం అలానే చేసింది. వరుడ్ని సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయేలా చేయాలనుకుంది. అలాగే పెళ్లి వేదిక మీదకు వచ్చింది. ముహూర్తం సమయానికి పుత్తడి బొమ్మలా అలంకరించుకుని పెళ్లి పీటల మీదుకు వస్తున్న చూసిన వధువును చూసి వరుడి కంటి వెంట ఆనంద బాష్పాలు జల,జలా రాలాయి. వధువును చూసిన వరుడు భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ ఆనంద క్షణాలను ఓ కెమెరామెన్ తన కెమెరాలో బంధించాడు, దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ వైర్ ఇండియా అనే
ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్‌ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by WeddingWire India (@weddingwireindia)