Diet : భూమిపై ఎక్కవ కాలం బ్రతకాలని ఉందా!.. అయితే ఇలాంటి ఆహారాన్ని తీసుకోండి…
మన జీవితకాలాన్నిపెంచుకునేందుక కొన్ని ముఖ్యమైన ఆహారపదార్ధాలను తీసుకోవటం మంచిది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీనట్ బటర్. దీనిని తినడం ద్వారా 33 నిమిషాల

Food (1)
Diet : మనిషికి ఎక్కవ కాలం భూమిపై జీవించాలన్నకోరిక ఉంటుంది. అనుకోని ప్రమాదాల వల్ల ప్రాణాలు పోతే ఇక చెప్పాల్సిన పనిలేదు. సరైనా ఆహారం తీసుకోక పోవటం వల్ల జబ్బులు కొని తెచ్చుకుంటూ కొందరు అర్హాయుష్కులుగా వెళ్ళిపోతున్నారు. ఈ తప్పిదం మనం చేజేతులా చేసుకునేదే. కొద్దిపాటి ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే నిండు నూరేళ్ళ జీవితకాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారమై మన జీవితకాలాన్ని నిర్ణయిస్తుందనటంలో ఎలాంటి సందేహంలేదు.
ప్రస్తుతం మనుషుల జీవితాలు యాంత్రికమైపోయాయి. బిజీ లైఫ్ లో తీసుకునే ఆహారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా నిరంతరం డబ్బు సంపాదనే ధ్యేయంగా మనిషి పాకులాడుతుండటంతో జీవన ప్రమాణాలు రోజురోజుకు పడిపోతున్నాయి. శరీరానికి అవసరంలేని ఆహారాన్ని తీసుకుంటూ చివరకు వాటి కారణంగా వ్యాధుల బారిన పడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. మన జీవితం సాఫీగా సాగేందుకు పోషక విలువలున్న ఆహారాన్ని తినాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మన ఆయుర్ధాయం పెంచుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింకులు, పలు రకాల మాంసాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఇలాంటివి తిన్న ప్రతిసారి వ్యక్తి జీవితకాలం 36 నిమిషాలు తగ్గిపోనున్నది గుర్తించుకోవాలి. మనం తినే ఆహారాలు మన జీవితకాలంపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. దాదాపు 5 వేలకు పైగా ఆహార పదార్థాలపై అధ్యయనం జరిపారు. అలాగే, మనం నిత్యం తయారుచేసే ఆహార పదార్థాల నుంచి పారవేసే వరకు అవి మన పర్యావరణంపై ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో అనే విషయాన్ని తమ అధ్యయనం ద్వారా చూపించే ప్రయత్నం చేశారు.
అమెరికన్లు తినేందుకు అమితంగా ఇష్టపడే 1 గ్రాము ప్రాసెస్డ్ మాంసం తినడం ద్వారా 0.45 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందంట. ఒక్క హాట్‌డాగ్‌లో దాదాపు 61 గ్రాముల ప్రాసెస్డ్ మాంసంతో 27 నిమిషాల జీవితకాలాన్ని కోల్పోతున్నట్లు అధ్యయనంలో తేల్చారు. సాఫ్ట్‌డ్రింక్‌ను తాగడం ద్వారా 12.4 నిమిషాల జీవితాన్ని కోల్పోతున్నారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. డబల్ ఛీజ్ బర్గర్ తింటే 8.8 నిమిషాలు, పిజ్జాలు తినడం వల్ల 7.8 నిమిషాలు, నిప్పులపై కాల్చిన చికెన్ వింగ్స్ తింటే 3.3 నిమిషాల జీవితకాలాన్ని కోల్పోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.
మన జీవితకాలాన్నిపెంచుకునేందుక కొన్ని ముఖ్యమైన ఆహారపదార్ధాలను తీసుకోవటం మంచిది. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీనట్ బటర్. దీనిని తినడం ద్వారా 33 నిమిషాల ఆయుర్ధాయం పెంచుకోవచ్చు.. అవకాడోలు తినడం ద్వారా 3.8 నిమిషాలు, ఆపిల్ పాయి తింటే 26 నిమిషాల ఆయుర్ధాయంఉప్పు వేసిన వేరుశనగ పప్పులను తింటే 26 నిమిషాలు, బేక్ చేసిన సాల్మన్ చేపలు తింటే 16 నిమిషాలు, రాజ్మాతో అన్నం తింటే 13 నిమిషాలు, అరటిపండ్లతో 13.5 నిమిషాలు, టమాటలతో 3.8 నిమిషాల జీవితకాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
జీవితానికి చేటు తెచ్చే అల్మాహాల్,సిగరెట్ వంటి అలవాట్లను మానుకోవాలి. మనం తీసుకునే ఆహారాల నుండి 10శాతానికి మించకుండా క్యాలరీలు ఉండేలా చూసుకుంటే మంచిది. నీరు ఎక్కవగా తాగటం, కూరగాయలు, ఆకుకూరలు తినే ఆహారంలో ఎక్కవ మోతాదులో ఉండేలా చూసుకుంటే ఆయుర్ధాయాన్ని పెంచుకోవచ్చు.