Eating Papaya : బొప్పాయి తినక ముందు, తిన్న తరువాత ఈ ప్రొటీన్ ఆహారాలను తినకపోవటమే మంచిది !
పెరుగు, పాలు, చీజ్ వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ల పై ప్రభావం చూపుతుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Eating Papaya
Eating Papaya : బొప్పాయి పోషక ప్రయోజనాల కలిగిన పండు. బొప్పాయిలో విటమిన్ సి, ఎ, కె.. పొటాషియం, ఫోలేట్ తోపాటు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కేలరీలు, ఫైబర్ వంటివి ఉంటాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తింటే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గుతుంది. బొప్పాయిలో ఉండే లైకోపీన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెదడులోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. విటమిన్ కె తక్కువగా ఉన్న వ్యక్తులు బొప్పాయి తీసుకుంటే.. శరీరంలోని ఎముకలు బలోపేతం అవుతాయి.
READ ALSO : Papaya Fruit : బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందంటారు .. నిజమేనా?
బొప్పాయిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయం చేస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్, వాటర్ అధిక కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం, జుట్టుతో సహా అన్ని శారీరక కణజాలాల పెరుగుదలకు దోహదపడుతుంది.
ప్రొటీన్ ఆహారాలు తినకముందు, తిన్నతరువాత బొప్పాయి తినొద్దు ;
బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ మన శరీరంలోని ప్రొటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఎంజైమ్ చాలా శక్తివంతమైనది. ఇది ఇతర ఆహార పదార్థాలలోని ప్రొటీన్లను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. కనుకబొప్పాయి తిన్న తర్వాత, తినక ముందు ప్రొటీన్ ఆహారాలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : Papaya : జీర్ణక్రియను మెరుగుపరచటంలో అద్భుతంగా ఉపయోగపడే పచ్చిబొప్పాయి?
పాల ఉత్పత్తులు: పెరుగు, పాలు, చీజ్ వంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్ల పై ప్రభావం చూపుతుంది. కాబట్టి బొప్పాయి తిన్న తర్వాత పాలు, పెరుగు వంటివి తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి రోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
గుడ్లు: బొప్పాయి పండు తిన్నాక గుడ్డుతో చేసిన ఆహారం, అంటే ఉడికించిన, అమ్లెట్ రూపంలో తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తింటే అజీర్ణం, వికారం, కడుపు సమస్యలు వస్తాయి.
READ ALSO : Papaya : బరువు సులభంగా తగ్గాలనుకునే వారికి…. బొప్పాయి బెటర్
ఫ్రూట్ సలాడ్ : ఇతర పండ్లను తిన్న తర్వాత బొప్పాయి పండు తింటే జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పండులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు కలిగిస్తుంది.
కూల్ వాటర్ : బొప్పాయి తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే జీర్ణ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బొప్పాయి తిన్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
బొప్పాయి నారింజ ; నారింజ ,బొప్పాయి రెండు వ్యతిరేక పండ్లు. ఈ రెండింటిలో ఏదైనా ఏదైనా ఒకటి తినాలి. బొప్పాయిలు, నారింజ కలిపి తినడం వల్ల విరేచనాలు, మలబద్ధకం, కడుపు నొప్పి వస్తుంది.