Papaya Fruit : బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందంటారు .. నిజమేనా?

బొప్పాయి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే గర్భిణీలు బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందనే అపోహ చాలామందిలో ఉంది. నిజంగానే బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందా? వాస్తవం ఏంటి?

Papaya Fruit : బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుందంటారు .. నిజమేనా?

Papaya Fruit

Updated On : July 6, 2023 / 1:09 PM IST

Papaya Fruit : స్త్రీ గర్భం దాల్చడం అనేది ఎంతో సంతోషాన్ని కలిగించే అంశం. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా తను తల్లి కావాలని ఎదురుచూసే ఘడియ. అయితే ఈ సమయంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే వారు తీసుకునే ఆహారం డైరెక్ట‌గా గర్భంలో ఉన్న పిండంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఈ సమయంలో బొప్పాయి తినకూడదని చాలామంది అంటుంటారు. ఎందుకు తినకూడదు? తినాలా? వద్దా? అనే సంశయాలు మాత్రం చాలామందిలో ఉంటాయి.

coloring hair during pregnancy : గర్భధారణ సమయంలో జుట్టుకు రంగు వేయడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రభావం పడుతుందా ?

పండ్లలో బొప్పాయిని దేవతా ఫలం అంటారు. ఇది సౌత్ అమెరికా నుంచి వచ్చిన పంట. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయి తినకూడదు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. ఇది గర్భస్రావానికి దారి తీస్తుంది అంటారు. నిజానికి బొప్పాయిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున  ప్రెగ్నెన్సీ సమయంలో తినమని డాక్టర్లు సూచిస్తారు.

 

బొప్పాయి ప్రెగ్నెన్సీ సమయంలో తినడం మంచిదేనట. అయితే పచ్చివి, లేదా కొంచెం రంగు వచ్చిన బొప్పాయిలు మంచి కావట. పండని బొప్పాయిలో పపైన్, లాటెక్స్ అనేవి ఉంటాయట. ఇవి గర్భస్రావానికి దారి తీస్తాయట. పండని బొప్పాయిలో పపైన్ ఉండటం వల్ల పిండం చుట్టూ ఉండే పొరను బలహీనం చేస్తుందట. ఇక పండిన బొప్పాయిలో విటమిన్ ఎ,బి,సి, పొటాషియం మరియు బీటా కెరోటిన్‌లు ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో శిశువు ఆరోగ్యానికి సహకరిస్తాయి. బొప్పాయి తింటే త్వరగా జీర్ణం అవుతుంది. మార్నింగ్ సిక్‌నెస్‌తో బాధపడే గర్భిణీలకు ఆ సమస్యను అధిగమించడంలో సహాయపడుతుందట.

Pregnancy : గర్భధారణ సమయంలో సాధారణ సమస్యలు ! కారణాలు, వాటిని ఎదుర్కోవటానికి చిట్కాలు..

ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వస్తే ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో సహాయపడుతుందట. పండిన బొప్పాయిలు తింటే పాల ఉత్పత్తి కూడా పెరుగుతుందట. అయితే పండిన బొప్పాయిని పరిమితికి మించకుండా తీసుకోవడంలో తప్పులేదట. ఇక ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న వారు సైతం పచ్చి లేదా పండని బొప్పాయిని తీసుకోకూడదని గుర్తుపెట్టుకోండి.