Heart Attack : ఏది గుండెనొప్పి? గుండె పోటును గుర్తించటం ఎలా ?

ఛాతి కుహరంలో గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు, అన్నవాహిక వంటి అవయవాల వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిలో ఎందులో సమస్య ఉన్నా ఛాతి నొప్పి రావచ్చు.

Heart Attack : ఏది గుండెనొప్పి? గుండె పోటును గుర్తించటం ఎలా ?

heart attack

Heart Attack : గుండె పోటు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో అది గుండెపోటని గుర్తించలేకపోవడం వల్లనే సీరియస్ కండిషన్ కి దారితీస్తుంది. ఛాతిలో మాత్రమే కాదు.. చెయ్యి నొప్పి, కడుపు నొప్పి కూడా కొన్నిసార్లు గుండెపోటుకు సంకేతాలు కావొచ్చు. ఇలాంటి పరిస్థితులు కనిపిస్తే గుండెలో సమస్య ఉందేమోనని అనుమానించి వెంటనే వైద్య సహాయం తీసుకోమంటున్నారు కార్డియాలజిస్టులు.

READ ALSO : Holiday weight gain : పండగల్లో బరువు పెరుగుతున్నారా? ఇలా తగ్గించుకోండి..

ఒకవైపు చదువులనీ.. కెరీర్ లనీ… ఉన్నత పదవులనీ… ఇలా ర్యాట్ రేస్ లో పరుగులు. మరోవైపు సరైన తిండి తినడానికి కూడా టైం లేకపోవడం, రెడీ టు ఈట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఇంకొకవైపు శరీరాన్ని కదిలించే అవసరం లేని ఉద్యోగాలు. అన్నీ మూకుమ్మడిగా దాడి చేసి మన ఆరోగ్యాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇలాంటి రకరకాల ఒత్తిళ్లు గుండెను బలహీనం చేస్తున్నాయి. అందుకే రోజురోజుకూ చిన్న వయసులోనే గుండెపోట్లకుగురయ్యేవాళ్ల సంఖ్య పెరుగుతున్నది. కొవిడ్ తర్వాతైతే చాలామంది ఉన్నట్టుండి సడన్ గా గుండె ఆగిపోయి, మాయమైపోతున్నారు.

చాలా సందర్భాల్లో ఛాతిలో నొప్పి అసిడిటీ వల్లనేమో, గ్యాస్ బాధ ఎక్కువైందేమోఅనో భావించి యాంటాసిడ్ టాబ్లెట్లు వేసుకుని ఊరుకుంటుంటారు. హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోయేవరకూ అది గుండెలో నొప్పని తెలియదు. అందుకే ఛాతిలో నొప్పిని అశ్రద్ధ చేయవద్దు. అది అసిడిటీదేఅని నమ్మకంగా అనిపించినా సరే.. డాక్టర్ తో మమ అనిపించుకోవడం చాలా అవసరం.

READ ALSO : WhatsApp AI Stickers : వాట్సాప్ ఏఐ స్టిక్కర్లు.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఛాతి కుహరంలో గుండె మాత్రమే కాకుండా ఊపిరితిత్తులు, కండరాలు, ఎముకలు, అన్నవాహిక వంటి అవయవాల వ్యవస్థలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిలో ఎందులో సమస్య ఉన్నా ఛాతి నొప్పి రావచ్చు. అలాగని గుండెకు సంబంధించింది కాదేమోననిఛాతి నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు.

ముఖ్యమైన లక్షణాలివే…

ఛాతి మధ్య భాగంలో నొప్పి తీవ్రంగా ఉండి 20 నిమిషాలకు పైగా నొప్పి ఉండటం

ఎడమ చేయి బాగా లాగుతున్నట్టు ఉండటం

ఛాతిలో నొప్పి, అసౌకర్యంతో పాటు చెమటలు బాగా పట్టడం. ఈ స్థితి అరగంటకు పైగా ఉండటం.

కొద్ది దూరంగా అడుగులు వేసినా ఛాతిలో నొప్పి పెరుగుతూ ఉండటం

నడిస్తే ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండటం

READ ALSO : Health Benefits of Fasting : ఉపవాసం అవసరమా? దీని వల్ల ఆరోగ్యానికి కలిగే మేలెంత..

ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే.. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయని అర్థం చేసుకోవచ్చు. ఈ అడ్డంకుల వల్ల రక్త సరఫరా సజావుగాజరుగక గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోగా వైద్య సహాయం అందితే ప్రాణాపాయాన్ని నివారించొచ్చు.