Virat Kohli Black Water : విరాట్ కోహ్లీ హెల్త్ సీక్రెట్ ఇదేనా? ఈ సెలబ్రిటీలు ఖరీదైన ‘బ్లాక్ వాటర్’ ఎందుకు తెగ తాగేస్తున్నారో తెలుసా?

Virat Kohli : విరాట్ కోహ్లీ ఎప్పుడూ చూసినా బ్లాక్ ఆల్కలీన్ వాటర్ తాగుతూ కనిపిస్తాడు. ఎంతో ఖరీదైన ఈ బ్లాక్ వాటర్ ఎక్కువ మంది సెలబ్రిటీలు తాగేస్తున్నారు. ఈ బ్లాక్ వాటర్ లో దాగిన బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Virat Kohli Black Water : విరాట్ కోహ్లీ హెల్త్ సీక్రెట్ ఇదేనా? ఈ సెలబ్రిటీలు ఖరీదైన ‘బ్లాక్ వాటర్’ ఎందుకు తెగ తాగేస్తున్నారో తెలుసా?

Virat Kohli Black Water

Updated On : March 9, 2025 / 12:21 AM IST

Virat Kohli Black Water : భారత క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హెల్త్ సీక్రెట్ ఏంటి? కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి ఎంత కేర్ తీసుకుంటాడో తెలుసా? 36 ఏళ్ల వయసులో కూడా కోహ్లీ ఎంతో యాక్టివ్‌గా 16 ఏళ్ల యువకుడిలా కనిపిస్తుంటాడు. విరాట్ మైదానంలో అడుగుపెట్టిన వెంటనే ఎంత వేగంగా పరిగెడుతున్నాడో చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అసలు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ వెనుక అసలు సీక్రెట్ ఏంటో తెలుసా?

సాధారణంగా చాలామంది వ్యాయామాలు, తినే ఆహారమే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ కారణమని అంటుంటారు. కానీ, విరాట్ తన ఆహారంలో ఉడికించిన, కాల్చిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాడు. అంతేకాదు.. ఆల్కలీన్ వాటర్ కూడా తాగుతాడు.

Read Also : Samsung Galaxy S23 Offer : ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. ఈ శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.50వేలు డిస్కౌంట్.. ఇప్పుడే కొనేసుకోండి!

ఈ నీళ్లనే బ్లాక్ వాటర్ అని కూడా పిలుస్తారు. సాధారణ నీటి కన్నా భిన్నంగా ఉంటుంది. చాలా ఖరీదైనది కూడా. కానీ, విరాట్ ఒక్కడే ఈ బ్లాక్ వాటర్ తాగుతాడా? కోహ్లీ మాత్రమే కాదు.. ఈ బ్లాక్ వాటర్ వినియోగించేవారిలో అనేక మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

బ్లాక్ వాటర్ (ఆల్కలీన్) ఏంటి? :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్లాక్ ఆల్కలీన్ వాటర్ పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాల కారణంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ, పోషకాహార నిపుణులు సైతం ఈ వాటర్ ఏదో మిస్టరీ దాగి లేదని అంటున్నారు. సహజంగా ఈ బ్లాక్ వాటర్ ముదురు రంగులో ఉంటుందని ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుందని చెబుతున్నారు. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలక ఖనిజాలతో కలిసి ఉంటుందని చెబుతున్నారు.

మరో మాటలో చెప్పాలంటే.. బ్లాక్ వాటర్ అనేది సాధారణ వాటర్ లేదా (RO) నీటి కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే దీన్ని ఆల్కలీన్ వాటర్ అని పిలుస్తారు. ఇందులో హై పీహెచ్ (pH) స్థాయిని కలిగి ఉంటుంది. యూరప్‌లోని అతిపెద్ద సరస్సులలో ఒకటైన ఎవియన్ లెస్ బెయిన్స్ నుంచి ఈ నీటిని తీసుకొస్తారట.

బ్లాక్ వాటర్ లీటర్ ధర రూ. 4వేలు :
భారత మార్కెట్లో ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ. 4వేలు అంట. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని కాంతివంతం చేయడం, బరువు తగ్గడం, రక్తపోటు, మధుమేహం, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని చెబుతారు. అంతమాత్రమే కాదు, బ్లాక్ వాటర్ బోన్స్ కూడా గట్టిపరుస్తుందట. అందుకే విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయస్సులో కూడా చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు.

Read Also : Women’s Day 2025 : 30 ఏళ్ల మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన టాప్ 3 మెడికల్ స్క్రీనింగ్ ఇవే..!

ఈ సెలబ్రిటీలు ఆల్కలీన్ వాటర్ తాగుతారట :
ఆల్కలీన్ వాటర్ తాగే సెలబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు. వాస్తవానికి, శ్రుతి హాసన్, మలైకా అరోరా, ఊర్వశి రౌతేలా వంటి ప్రముఖులు కూడా బ్లాక్ వాటర్ తాగుతారట. ఈ ముగ్గురు సెలబ్రిటీలు ఫిట్‌నెస్ ఫ్రీక్‌లు అనే విషయం తెలిసిందే. మలైకా అరోరా 50 ఏళ్లు పైబడిన తర్వాత కూడా 30 ఏళ్ల అమ్మాయి కన్నా యవ్వనంగా కనిపిస్తారు.