Winter Food : చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలంటే?
చలికాలంలో ప్రతి రోజు ఒక పండును తీసుకోవడం వల్ల మన చర్మం పొడి బారకుండా తేమగా ఉంటుంది. దీంతో చర్మం పగలదు. చర్మానికి కావలసినంత తేమ సమకూరడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Winter Food
Winter Food : చలికాలంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మరి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అంటే.. దానికి తగినట్లు ఆహారాలు తీసుకోవాలి. వాటిని ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తద్వారా మన శరీరం ఎంతో వెచ్చగా ఉండి మన జీవ ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ డీ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
శరీరానికి చలిని తట్టుకునే శక్తి కావాలంటే మన ఆహార పదార్థాలలో ఎక్కువగా పెసలు, మినుములు, శనగలు, గోధుమలు వంటి ఆహార పదార్థాలను చేర్చుకోవాలి. అదేవిధంగా పాలు, పాల పదార్థాలను కూడా అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఉదయం తయారుచేసిన వంటలను రాత్రి తినకూడదు. ఎప్పటికప్పుడు వేడిగా చేసుకొని తినడం వల్ల మన శరీరం వెచ్చగా ఉండటమే కాకుండా ఏ విధమైనటువంటి జీర్ణక్రియ సమస్యలు ఉండవు.
చలికాలంలో ప్రతి రోజు ఒక పండును తీసుకోవడం వల్ల మన చర్మం పొడి బారకుండా తేమగా ఉంటుంది. దీంతో చర్మం పగలదు. చర్మానికి కావలసినంత తేమ సమకూరడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధికారక క్రిములు దూరం కావాలంటే ఎక్కువగా అల్లం, పసుపు, జీలకర్ర, మిరియాలు వంటి పదార్థలను అధికంగా తీసుకోవాలి. ఈ విధమైన ఆహారపదార్థాలను తీసుకుంటే మన శరీరం ఎంతో వెచ్చగా ఉంటుంది. ఈ కాలంలో జమపండ్లను అధికంగా తింటే శరీరం పోడిబారకుండా రక్షణనిస్తుంది. ఈ జామపండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తిన్న ఆహరం అరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది.
చలికాలంలో తినాల్సిన ఆహారాల్లో బాదం ఒకటి. వీటిలో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి రోగనిరోధక శక్తిని మరింత పెంపొందిస్తాయి. దీనిలో ప్రొటీన్స్, ఫైబర్, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. కివీ ఫ్రూట్.. ఈ పండు తినడం చాలా మంచిది. దీనిలో కూడా విటమిన్ సీ ఎక్కువగా లభిస్తుంది. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లో విటమిన్ ఇ కంటెంట్ అధికంగా ఉంటుంది. మీరు ఉదయం తాగే టీతో కలిపి కాల్చిన పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకుంటే మంచిది. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళను త్రాగాలి. సీజన్ తో సంబంధం లేకుండా, సమ్మర్ అయినా వింటర్ అయినా బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయాలంటే నీరు అవసరం. తగినంత నీరు తాగుతూ ఉండడం వల్ల లోపలి నుండి టెంపరేచర్ రెగ్యులేషన్ జరుగుతుంది.