వాటర్ వార్‌తో కేసీఆర్ ప్లాన్.. రేవంత్‌ కౌంటర్‌ ఆపరేషన్.. సిట్‌ నుంచి నోటీసులు, అసెంబ్లీలో చర్చ

నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చెప్తామంటూ.. శాసన సభ వేదికగా గులాబీ దళపతిని ఇరకాటంలో పెట్టే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట.

వాటర్ వార్‌తో కేసీఆర్ ప్లాన్.. రేవంత్‌ కౌంటర్‌ ఆపరేషన్.. సిట్‌ నుంచి నోటీసులు, అసెంబ్లీలో చర్చ

Updated On : December 23, 2025 / 8:51 PM IST

BRS vs Congress: తెలంగాణ పాలిటిక్స్‌..ఎప్పటికప్పుడు క్లైమాక్స్‌లో ట్విస్ట్‌ను తలపిస్తున్నాయ్. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్‌ ఉండగానే ఎత్తుకు, పైఎత్తులు వేస్తూ..ఒకరి మీద మరొకరు అప్పర్ హ్యాండ్ సాధించే గేమ్స్ స్టార్ట్ చేశాయి పార్టీలు. ఈ క్రమంలోనే చాలా రోజుల తర్వాత ఫాంహౌస్‌ నుంచి బయటికి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్..మరోసారి సెంటిమెంట్‌ పాలిటిక్స్‌కు తెరలేపారు.

ఏకంగా కృష్ణా వాటర్‌లో అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను కేంద్రం రిటర్న్ పంపిందంటూ సర్కార్‌పై బాణాలు ఎక్కుపెట్టారు. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరులో బహిరంగ సభలు పెట్టడమే కాదు..గ్రామగ్రామాన కృష్ణా జలాల విషయంలో..కాంగ్రెస్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడుతామంటూ బ్లాస్టింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

ఐయామ్‌ ఆన్‌ ది ఫీల్డ్‌. ఇక రెగ్యులర్‌గా అవేలెబుల్‌ ఉంటానంటూ నీళ్ల లొల్లికి ఆజ్యం పోస్తున్నారు. అయితే కేసీఆర్‌ చాలా సెన్సిటీవ్ అంశాన్ని..పైగా రైతుల్లో చర్చకు దారితీసే టాపిక్‌ను ఎత్తుకోవడంతో..కాంగ్రెస్ సర్కార్‌ కార్నర్ అయిపోయినట్లేనన్న చర్చ జరిగింది.

Also Read: కేసీఆర్ చుట్టూ ఆ పది మంది..! కేటీఆర్, హరీశ్‌ చుట్టూ వారే.. మరెవ్వరిని దగ్గరకు రానివ్వని ఆ పది మంది..

అయితే వాటర్ వార్ పేరుతో జనంలోకి వెళ్లేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్‌ దూకుడుకు బ్రేకులు వేసేందుకు..సీఎం రేవంత్ సరికొత్త అస్త్రాన్ని బయటికి తీసినట్లు ప్రచారం బయలుదేరింది. త్వరలో గులాబీ బాస్ కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంటెలిజెన్స్ మాజీ ఐజీ ప్రభాకర్‌ రావు సుప్రీంకోర్టు ఆదేశాలతో లొంగిపోవడం..లేటెస్ట్‌గా సజ్జనార్‌ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేయడంతో..ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ కానుంది.

కాంగ్రెస్‌ సర్కార్‌కు సవాల్‌
ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా..గులాబీ బాస్ కేసీఆర్ వాటర్ ఇష్యూతో తెరమీదకు రావడం కాంగ్రెస్‌ సర్కార్‌కు సవాల్‌గా మారింది. ఏకంగా రేవంత్‌ ప్రభుత్వం చేతగాని తనం వల్లే కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ కేసీఆర్ గళమెత్తుతున్నారు. అంతేకాదు మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు పెట్టడంతో పాటు..కృష్ణా జలాలపై వరుస ప్రొగ్రామ్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో సీఎం రేవంత్‌..కేసీఆర్‌ వాటర్‌ వార్‌కు బ్రేకులు వేసే ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ఇప్పటికే సవాల్‌ విసిరారు రేవంత్. కృష్ణా జలాల్లో 36శాతం చాలని సంతకం చేసింది కేసీఆరే అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సభలు పెట్టిన చోటల్లా..ముచ్చుమర్రి, మల్యాల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను పొగుడుతూ కేసీఆర్ మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తామని అంటున్నారు. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సెషన్‌కు రెడీ అవుతున్న సర్కార్..జనవరి 2న సభలో కృష్ణాజలాలపై చర్చ పెట్టేందుకు ప్లాన్ చేస్తోందట.

ఈ చర్చలో పాల్గొనాలంటూ కేసీఆర్‌ను సవాల్ చేస్తున్నారు రేవంత్. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ వేదికగా చెప్తామంటూ.. శాసన సభ వేదికగా గులాబీ దళపతిని ఇరకాటంలో పెట్టే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. పైపులు, కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను అమ్మేశారని దుమ్మెత్తిపోస్తున్నారు రేవంత్. ఇలా కేసీఆర్ వాటర్‌ వార్‌కు ఆదిలోనే చెక్ పెట్టాలన్నదే రేవంత్‌ ఆలోచనగా ఇన్‌సైడ్‌ టాక్.

అయితే టూ ఇయర్స్ తర్వాత రేవంత్‌ సర్కార్‌పై డైరెక్ట్‌గా బాణాలు ఎక్కుపెడుతూ..కృష్ణా వాటర్‌ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న కేసీఆర్‌ను..ద్విముఖ వ్యూహంతో ఢీకొట్టే ఎత్తులు వేస్తున్నారట సీఎం రేవంత్‌. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో పాటు మరోవైపు అసెంబ్లీలో కృష్ణా, గోదావరి జలాలపై చర్చ పెట్టి..బీఆర్ఎస్‌ను డైలమాలో పడేయాలన్నది రేవంత్ స్కెచ్ అంటున్నారు. మరి రేవంత్‌ గేమ్‌ ప్లాన్‌కు కేసీఆర్‌ దగ్గరున్న విరుగుడు ఏంటనేది వేచి చూడాలి.