Covid Vaccine : ఏ వ్యాక్సిన్.. బ్రేక్‌త్రూ కేసుల నుంచి అత్యధిక రక్షణ ఇవ్వగలదంటే!
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో ఏది అత్యధికంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇవ్వగలదు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Covid 19 Vaccine Guarantees The Most Protection Against Breakthrough Cases
COVID-19 vaccine breakthrough cases : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనావ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. కొత్త వేరియంట్లతో మరిన్ని కేసులు విజృంభిస్తున్నాయి. ఒకవైపు కరోనావ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా భారత్ సహా ప్రపంచ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. అయనప్పటికీ కరోనా కేసులు తగ్గడం లేదు. ముఖ్యంగా బ్రేక్ త్రూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లు ప్రతిరోజు నమోదవుతూనే ఉన్నాయి. అందులోనూ డెల్టా వేరియంట్ వైరస్ ఈ బ్రేక్ త్రూ కేసులకు కారణమవుతోంది. చాలా మంది నిపుణులు బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల పెరుగుదల సాధారణమేనని భావిస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రతతో పాటు లక్షణాలను తగ్గించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లలో ఏది అత్యధికంగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ ఇవ్వగలదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏదైనా ఒక నిర్దిష్ట వ్యాక్సిన్ మోతాదు ఇతర టీకాల కన్నా ఎక్కువగా కరోనాను అడ్డుకోగలదో కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
అసలు బ్రేక్‌త్రూ కేసు అంటే ఏంటి? :
అసలు కరోనా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కేసు అంటే.. పాక్షికంగా, లేదా పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తిలో కొంత స్థాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆ సమయంలోకోవిడ్-19 సోకినట్టయితే దాన్ని breakthrough కేసుగా చెబుతారు. బ్రేక్ త్రూ కేసులు శరీరంలో SARS-COV-2 వైరస్, మ్యుటేషన్లు వ్యాప్తిచెందడానికి కరోనా టీకా తీసుకున్నప్పటికీ కూడా అవకాశం ఉంటుంది. అయితే సాధారణ COVID వ్యాప్తికి భిన్నంగా ఉంటుంది. అంటే టీకాలు తీసుకోనివారిలోకంటే.. అంతేకాదు.. కరోనా లక్షణాల తీవ్రత, రికవరీకి తీసుకున్న సమయం (TTR), లక్షణాలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి, ట్రాన్స్‌మిషన్ వేరుగా ఉంటుంది. ఈ బ్రేక్ త్రూ కేసులు చాలా అరుదు.. అందరిలోనూ ఉండకపోవచ్చు. బ్రేక్ త్రూ కేసులు పెరగడానికి అతిపెద్ద కారణాలలో ఒకటి డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల పెరుగుదలే.. వాస్తవానికి SARS-COV-2 వేరియంట్లపై కరోనా టీకాలు అత్యంత ప్రభావవంతమైనవి.. అలాగే సమర్థవంతంగా రక్షణగా ఇస్తాయని కూడా రుజువైంది. డెల్టా వేరియంట్ టీకా సామర్థ్యాన్ని తగ్గించి, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. తద్వారా వైరస్ ప్రభావాన్ని పెంచుతుంది.
అధ్యయనాల్లో ఏం రుజువైందంటే? :
డెల్టా వేరియంట్ టీకా రక్షణలను విచ్ఛిన్నం చేస్తుంది. టీకా సమర్థత రేట్లను తగ్గించగలదు. ఏదేమైనా, ప్రస్తుత టీకాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయనేది వాస్తవం. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్, పూర్తి రక్షిణ ఇవ్వడంలోనూ చాలా తేడా ఉండవచ్చు.ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అనేక సెరోసర్వేలు, క్లినికల్ ఆధారాల ద్వారా ఇదే రుజువైంది. సాంప్రదాయ వైరల్ వెక్టర్, అడెనోవైరస్ నుంచి mRNA వ్యాక్సిన్ల వరకు, వివిధ టీకాలు డెల్టా వేరియంట్‌పై సామర్థ్య రేట్లను కోల్పోయే అవకాశం ఉంది. బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్లకు దారితీసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. USA క్లినికల్ పరిశోధన ప్రకారం.. ప్రస్తుతం డెల్టా వేరియంట్ పై జాన్సన్-జాన్సన్ వ్యాక్సిన్ (0.59శాతం) పొందిన లబ్ధిదారులలో కరోనా సంక్రమించే అవకాశం అధికంగా ఉందని రుజువైంది. ఆ తరువాత ఫైజర్ (0.04శాతం), మోడర్నా (0.07శాతం)గా ఉన్నాయి.
జాన్సెన్ వ్యాక్సిన్ ఒక అడెనోవైరస్ వెక్టర్ టీకా.. అలాగే మోడెర్నా, ఫైజర్ రెండూ mRNA టీకాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. mRNA టీకాలు ప్రమాదాలను నివారించడంలో బాగా పనిచేయగలవు. వేరియంట్‌లపై మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని తేలింది. భారతదేశంలో రెండవ వేవ్ సందర్భంగా నిర్వహించిన సెరోసర్వేల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ లో ప్రస్తుతం కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని అధ్యయనాలు కోవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్ 93శాతం ద్వారా బ్రేక్ త్రూ కేసులను తగ్గించగలదని రుజువైంది. ICMR నేతృత్వంలోని అధ్యయనాల్లో కోవిషీల్డ్ రెండు మోతాదులు పొందిన వారిలో అధిక ప్రభావవంతమైన రోగనిరోధక శక్తి పెరిగిందని రుజువైంది.
బ్రేక్‌త్రూ సంక్రమణ ముప్పు ఎప్పుడు తగ్గుతుందంటే?
బూస్టర్ షాట్‌ల ఆవశ్యకతపై వైద్య నిపుణుల్లో చర్చ కొనసాగుతోంది. పూర్తి వ్యాక్సిన్ తర్వాత 2-3 నెలల సమయంలో అత్యంత తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ని ఎదుర్కొనే ప్రమాదం కనిష్టంగా ఉండే అవకాశం ఉంది. ఒక వ్యక్తి రెండు పూర్తి మోతాదులను తీసుకుంటే.. టీకా వేసిన 14 రోజుల తర్వాత రోగనిరోధక శక్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. అది క్రమంగా అత్యధిక స్థాయిలో పెరిగి క్రమంగా టీకా తర్వాత 90 రోజుల వరకు ఉంటుంది. కొమొర్బిడిటీలు (తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు) బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. వయస్సు వంటి కొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి బాధితుల్లో కరోనా మళ్లీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రేక్ త్రూ కేసుల ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది.
వ్యాక్సిన్ సమర్థతలో తేడా ఉంటుందా? :
టీకా సమర్ధత, సామర్ధ్యం టీకా పనితీరు, రక్షణకు సంబంధించి అనేక ఆధారాలు ఉన్నాయి. వేర్వేరు టీకాలు వేర్వేరు సమర్థత రేట్లను కలిగి ఉంటాయి. ప్రస్తుతం mRNA టీకాలు అత్యధికంగా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్నాక మళ్లీ సోకే అవకాశం ఉంది. రోగనిరోధక శక్తిపై ఆధారపడి ఉండదు. డెల్టా వేరియంట్ కూడా బ్రేక్ త్రూ ఇన్‌ఫెక్షన్‌లకు సాధారణ కారణం అవుతోంది. సమర్థత రేటు మాత్రమే కాదు.. వ్యాక్సిన్ ఎంత వరకు తీవ్రమైన ముప్పు నుంచి రక్షణను అందిస్తుందో పోల్చి చూడాలి. హాస్పిటలైజేషన్ సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చు. కరోనా నుంచి మరణించే ముప్పు ఎంతవరకు తగ్గుతుందో గుర్తించాలి.
ఇవి తప్పక గుర్తించుకోవాలి :
కరోనాను పూర్తిగా నిరోధించగల ఏ టీకా 100శాతం ప్రభావవంతంగా ఉండదు. ఇందుకు విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉంది. వ్యాక్సిన్‌లు తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించినప్పటికీ ప్రమాదాలను తగ్గించే చాలా మార్గాలు మన చేతుల్లోనే ఉన్నాయని గుర్తించుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. తరచుగా చేతులను శానిటైజ్ చేస్తుండాలి. ఇవే సరైన నివారణ మార్గాలు. టీకాల ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించవచ్చు. తద్వారా కరోనా వ్యాప్తిని అదుపులోకి తీసుకురావచ్చు. కానీ, దీనికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకూ తగు జాగ్రత్తలు తీసుకోవడమే ఏకైక మార్గమని గుర్తించుకోవాలి.